Type Here to Get Search Results !

Sports Ad

ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు? Implementation of old pensions for this month's beneficiaries?

ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు?

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఆసరా పింఛన్లు ఇవ్వవలసి ఉంది. దీనికోసం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఎంతగానో ఎదురు చూస్తున్నారు.గత ప్రభుత్వం పింఛను రూ.3,016 గా ఇచ్చింది.అయితే కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగ పింఛనును రూ.6,000 చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో తమకు కొత్త పెన్షన్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు.ఈ నెల నుంచి ప్రభుత్వం తమకు పెన్షన్ పెంపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,98,729 మంది వృద్ధులు, 15,60,707 మంది వితంతువులు 

      దివ్యాంగులు 5,03,613 మంది బీడీ కార్మికులు 4,24,585 మంది ఒంటరి మహిళలు 1,42,394, గీత కార్మికులు 65,307, చేనేత కార్మికులు 37,145, హెచ్‌ఐవీ బాధితులు 35,998.. ఇలా వివిధ వర్గాలవారు మొత్తం 43,96,667 మంది పింఛన్లు తీసుకుంటుంటున్నారు.ఈ పెన్షన్ల అమలు కోసం ప్రతినెలా రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతోంది.అయితే ఈనెల మాత్రం పాత పద్దతిలోనే పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఎప్పటి నుంచి నెరవేరుతుందనే స్పష్టత లేనందున పాత తరహాలోనే పింఛన్లను విడుదల చేయనున్నారు.విధివిదానాలు ఖరారు చేయనుందున పాతపెన్షన్లే ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆసరా పింఛన్లను ఈ నెలలో పాత పంథాలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* అయోధ్యలో వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ఇక్కడ క్లిక్ చేయండి
* ఆయుర్వేదంలో అతిమధురం చూర్ణం ఉపయోగం ఏమిటి అవగాహనా కోసం వైద్య సలహాలు ఇక్కడ క్లిక్ చేయండి
* రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏది? అవగాహనా కోసం వైద్య నిలయం సలహాలు ఇక్కడ క్లిక్ చేయండి
* అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు  ఇక్కడ క్లిక్ చేయండి
* ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు? ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies