Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి; సీఎం రేవంత్ రెడ్డి Participate in the development of Telangana; CM Revanth Reddy


 తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి; సీఎం రేవంత్ రెడ్డి  

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,గ‌త‌రాత్రి ఆతిధ్యం ఇచ్చారు.అమెరికా, ఇరాన్, తుర్కియే, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్, బ్రిట‌న్, జ‌పాన్ , థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు ఈ ట్రీట్ కు హాజర‌య్యారు.ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యు న్నతికి నూతనంగా ఏర్పా టు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం ‘అభయహస్తం’తో అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తదితర నేతలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం సమానత్వం, పారదర్శకతతో పనిచేస్తోం దని, వెల్లడించారు.ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. యువత భవిష్యత్తు, పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశా లను ఆయా దేశాలు సద్వినియోగం చేసుకో వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.తెలంగాణను పారిశ్రామి కంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని సీఎం కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిణి స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
 * ఢిల్లీ ని వణికించిన భూకంపం ఇక్కడ క్లిక్ చేయండి
 * టీఎస్ పిఎస్పీ బోర్డు చైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ క్లిక్ చేయండి
 * కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి.ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి; సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies