Type Here to Get Search Results !

Sports Ad

ఏప్రిల్‌లో టెట్‌! Tet in April!


 ఏప్రిల్‌లో టెట్‌! 

* 60 వేల మంది టీచర్లు రాసే అవకాశం
* పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష
* ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డీఎస్సీ

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్‌ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్‌ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ పరీక్ష నిర్వ హించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు.2012కు ముందు టెట్‌ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్‌ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం  తెలిపింది. అయితే టెట్‌ పరీక్ష నిర్వహించే వరకూ ఈ నిబంధనను అమలు చేయలేమని పే ర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మిన హాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్‌ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి.

మెగా డీఎస్సీకీ టెట్‌ ఆటంకం

రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డీఎస్సీ చేపట్టాలంటే, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10 వేల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జీటీలు మొత్తం కలిపి 22 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. టెట్‌ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

టెట్‌ ఎవరికి?

రాష్ట్రంలో సర్వీస్‌లో ఉన్న వారికి డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ మాదిరి ప్రత్యేకంగా టెట్‌ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డీఎడ్‌ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేయాలన్నా టెట్‌ తప్పనిసరి. కాగా ఏడాదికి రెండు సార్లు టెట్‌ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా, ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నవారికి విధిగా టెట్‌ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, అందరికీ కలిపి సాధారణ టెట్‌ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది.టెన్త్‌ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్‌ మొదటి వారంలో టెట్‌ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్‌కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్‌పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

మరిన్ని వార్తల కోసం... 
* కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల ఇక్కడ క్లిక్ చేయండి
* అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి : సిఎస్ శాంతి కుమారి ఇక్కడ క్లిక్ చేయండి 
* సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500! ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ ఇక్కడ క్లిక్ చేయండి
* 12 ఏళ్ల సోదరిని గర్భవతి చేసిన మైనర్ సోదరుడు.. అబార్షన్ కోసం కోర్టుని ఆశ్రయించిన తల్లిదండ్రులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏప్రిల్‌లో టెట్‌! ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies