బొప్పాయి పండును వీళ్లు అస్సలు తినకూడదు.. తిన్నారంటే వీళ్ల పని అంతే!
ఆరోగ్యం Health : బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. డెంగ్యూ జ్వరం తొందరగా తగ్గుతుంది. రుతుస్రావ సమస్యలు కూడా పోతాయి. అయితే కొంతమంది మాత్రం ఈ పండును మొత్తానికే తినకూడదు.మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు బహుళ పోషకాలతో నిండిన ఆహారాలను ఎక్కువగా తినాలని సలహానిస్తుంటారు. పోషకాలు రకరకాల ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలను రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.ఆపిల్ పండ్లు, అరటిపండ్లు, ఖర్జూరాలు వంటి పండ్లతో పాటు ఉలవలు, వంకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయలను ఖచ్చితంగా తినాలి. వీటితో పాటుగా చాలా మంది బొప్పాయిని కూడా ప్రతిరోజూ తింటుంటారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దీనిలోని అనేక పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం ద్వారా కాలేయ ఆరోగ్యం బాగుండటమే కాకుండా.. రుతుస్రావం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే డెంగ్యూ వంటి వ్యాధులను కూడా బొప్పాయి నివారించడానికి సహాయపడుతుంది. బొప్పాయి పండే కాదు.దాని గింజలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఉండే ప్రోటియోలైటిక్ మూలకం శరీరానికి హాని కలిగించే జీవులను నాశనం చేస్తుంది.
ఇలాంటి బొప్పాయిని కొంతమంది మాత్రం తినకూడదు. తింటే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. బొప్పాయిని ఎవరెవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.గర్భిణీ స్త్రీలు :బొప్పాయి పండు గర్బిణులు అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే లేటెక్స్, పపైన్ అని పిలువబడే మూలకాలు గర్భాశయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది కడుపులోని బిడ్డ మరణానికి దారితీస్తుంది. అందుకే బొప్పాయి పండును గర్భిణులు అస్సలు తినకూడదు.హార్ట్ పేషెంట్స్.గుండె జబ్బులతో బాధపడేవారు కూడా బొప్పాయి పండును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే వివిధ మూలకాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీరు వీటి జోలికి వెళ్లకూడదు.కిడ్నీల్లో రాళ్లు మూత్రపిండాల్లో రాళ్లున్న వారు కూడా బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే విటమిన్ సి వీరి శరీరానికి హానిచేస్తుంది. కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి బొప్పాయికి దూరంగా ఉండండి.హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం) హైపోగ్లైసీమియా ఉన్నవారు కూడా బొప్పాయి పండును అస్సలు తినకూడదు.బొప్పాయిలో ఉండే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినొచ్చు.కానీహైపోగ్లైసీమియా ఉన్నవారు మాత్రం ఈ పండును తినకూడదు. ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిని మరింత తగ్గిస్తుంది. ఫలితంగా రోగులు ప్రమాదంలో పడతారు.