నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, విద్యాధికులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధికశాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు హక్కును వినియోగించుకుని రాజ్యాంగాన్ని గౌరవించుకుని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనదేశంలో ఓటు వేయని వారు 30శాతం ఉన్నారని, అది సున్నాకు రావాల్సిన అవసరం ఉంది. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకంటే శక్తివంతమైన పాత్ర శాసనాలు తయారు చేసే పార్లమెంట్, అసెంబ్లీలది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినది రాజకీయ నేతలే. అలాంటి నేతలను ఎన్నుకొనేది ఓటర్లే.అ మెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రజా స్వామ్యం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రజాస్వామ్యం అంటే ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకొనే విధానంఅన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ.ఇందులో ప్రజలు లేదా ఓటర్లు వేసే ఓటు వల్ల ఆ ప్రభు త్వాన్ని నిర్ణయిస్తారు.1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 జనవరి 25వ తేదీ నుండి నిర్వహి స్తోంది. 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటు కల్పించడం, ఓటు సవరణ, ఓటు విలువ తెలియచేయడం, ఓటు ప్రాముఖ్య తను చెప్పేలా ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.2011 జనవరి 25రోజున అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్రమంత్రి మండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిం ది. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్రప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది.
కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే బేధం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటుహక్కును కల్పిస్తున్నది.ఓట్లు వేసే అభ్యర్థులను ఓటర్లు అని పిలుస్తారు. దేశ అభివృద్ధికోసం నాయకులను ఎన్నుకోవడానికి ఓటు అనేది ఒక వజ్రాయుధం. భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు పాలకులను ఎన్నుకోవడమే ఓటు ముఖ్య ఉద్దేశం. ఓటు హక్కును సుమారు 20 నుంచి 30 శాతం ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రధాన కారణం ఓటు ప్రాముఖ్యత, విలువ తెలియకపోవడం.సరైన అవగాహన లేకపోవడం, నూరుశాతం పోలింగ్ సాధించే దిశగా ఎన్నికల సంఘం ఓటు ప్రాముఖ్యత, నమోదుపై ప్రతి సంవత్స రం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై చైతన్యం తీసుకురావడం, యువతను ఓటు నమోదుకు ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేస్తోంది. మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు అనేది ప్రజలకు అస్త్రం. ఎన్నికైన ప్రజాప్రతినిధులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని దేశాభివృద్ధికి సేవాభావం ఉన్న ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నది ఎన్నికల సంఘం ముఖ్యఉద్దేశం. ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం ఉన్నాయి.ప్రజాస్వామ్యం ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం కీలకపాత్ర పోషిస్తున్నది. ఏ రాజకీయ పార్టీకి తలవంచక స్వతంత్రంగా తన విధులను నిర్వర్తిస్తుంది. కేంద్రస్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు విధులను సమర్ధంగా నిర్వహిస్తున్నాయి.ప్రజాస్వామ్యం మనుగడ ఓటరుపై ఆధారపడి ఉన్నందున ఓటర్‌కు ప్రాధాన్యత పెరిగింది. రాజకీయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో యువతను భాగస్వాములు చేయాలని ఓటు ప్రాముఖ్యతను వివరించేందుకు కేంద్రప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది.
కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు అందిస్తుంది. ఓటు ప్రాముఖ్యత, కొత్త ఓటు నమోదు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తూ, అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుతోనే వార్డు సభ్యుల నుంచి రాష్ట్రపతి వరకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. భారతదేశంలో 1952 సార్వత్రిక వయో జన ఓటు హక్కు వినియోగంలోకి వచ్చింది. ఇంతకుముందు బ్యాలెట్ పేపర్‌ద్వారా ఓటు వేసేవారు. ప్రస్తుతం ప్రధాన ఎన్ని కల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు వినియోగిస్తున్నారు.అంతేకాక మరింత పారదర్శకంగా ఉండటం కోసం, వివి పాట్‌లను కూడా ఏర్పాటు చేశారు. 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు హక్కు పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. ఓటు నమోదుకు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, జనన ధ్రువీకరణ లేదా పదవ తరగతి మెమోద్వారా బూత్ లెవెల్ అధికారులకు లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.ధ్రువపత్రాలు అందచేసిన 15 రోజుల్లో పొందుపర్చిన వివరాల ఆధారంగా పరిశీలించిన తర్వాత రెవెన్యూ అధికారులు ఓటరు కార్డును లబ్ధిదారులకు పోస్ట్ ద్వారా అందచేస్తారు. లేదా మీ సేవా కేంద్రాల నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొద్దీ ఆలస్యం అయిన ఓటర్ కార్డు చేతికి వస్తుంది. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.ప్రజాస్వామ్య పటిష్టత ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది.
ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలో దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటర్లే. దేశంలో యువత బలం ఎక్కువగా ఉంది. కాబట్టి దేశ భవిష్యత్ దృష్ట్యా యువత ఓటు నమోదు చేసుకోవడంతోపాటు దానిని వినియోగించాలి. మనది ప్రజాస్వామ్యదేశమని, మన రాజ్యాంగం చాలా గొప్పదని, అనేక మతాలు, జాతులు, భాషలు, కులాలు ఉన్నా భిన్నత్వంలో ఉన్న గొప్పదేశం మనది.కాబట్టి ఓటు హక్కును కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వేచ్ఛకు అవకాశం ఉంటుంది.ముఖ్యంగా యువత, విద్యా ధికులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధికశాతంగ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు హక్కును విని యోగించుకుని రాజ్యాంగాన్ని గౌరవించుకుని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.మనదేశంలో ఓటు వేయని వారు 30శాతం ఉన్నారని, అది సున్నాకు రావాల్సిన అవసరం ఉంది. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకంటే శక్తివంతమైన పాత్ర శాసనాలు తయారు చేసే పార్లమెంట్, అసెంబ్లీలది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినది రాజకీయ నేతలే. అలాంటి నేతలను ఎన్నుకొనేది ఓటర్లే.వయోజనులైన ప్రతి వ్యక్తికీ ఎలాంటి బేధభావాలు లేకుండా ఓటు హక్కును కల్పించింది మన రాజ్యాంగం. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సాంఘిక, ఆర్థిక,సమానత్వాన్ని సాధించాలని, రాజ్యాం గ లక్ష్యం కూడా అదేనని, రాజకీయ ప్రజాస్వామ్యం సామాన్యు లకు అందకపోతే బాధితులు ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చే స్తారని నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ కు సమర్పిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఒక ఆయుధం. దానిని సక్రమంగా ఉపయోగిద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.