Type Here to Get Search Results !

Sports Ad

పనుల మీద కంటే ప్రచారం మీద ద్రుష్టిపెడితే మేమె గెలిచేవాళ్ళం : కేటీఆర్ We would have won if we focused on propaganda rather than work: KTR


 పనుల మీద కంటే ప్రచారం మీద ద్రుష్టిపెడితే మేమె గెలిచేవాళ్ళం : కేటీఆర్ 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్ కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.​ తెలంగాణ భవన్​లో ఇవాళ మహబూబాబాద్ లోక్​సభ నియోజకర్గ సన్నాహక సమావేశంలో పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుతో పాటు పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అందించినప్పటికీ ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వలేదని, అటువంటి అంశాలను ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు పోదామని బీఆర్​ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తెలిపారు. తెలంగాణ భవన్​లో జరుగుతున్న మహబూబాబాద్ లోక్​సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ అనుకోలేదని, అందుకే నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారని వివరించారు."కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది.కేటీఆర్ ​కాంగ్రెస్(Congress) తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని కేటీఆర్​ తెలిపారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారని, తొమ్మిదిన్నరేళ్లలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినట్లు కేటీఆర్ వివరించారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 73 శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. 

       29 లక్షల పింఛన్లను 46 లక్షలకు పెంచామన్న ఆయన, ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యామని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని, పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే తామే గెలిచే వాళ్లమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ఏనాడు ప్రజలను లైన్లలో నిలబెట్టలేదని, ప్రజల సౌకర్యం చూశాం తప్ప రాజకీయ ప్రయోజనం,ప్రచారం గురించి ఏనాడూ ఆలోచించలేదని అన్నారు. ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్, బీఆర్​ఎస్​కు మూడో వంతు సీట్లు 39 వచ్చాయని గుర్తు చేశారు.స్థానిక సంస్థలు మొదలు అసెంబ్లీ వరకు బలమైన నాయకత్వం ఉందని, అన్నింటికీ మించి కేసీఆర్(KCR) లాంటి గొప్ప నాయకుడు ఉన్నారని కేటీఆర్​ తెలిపారు. మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికలే గెలుపునకు సోపానం కావాలని అన్నారు. పార్టీ సమావేశాలను వరుసగా నిర్వహిస్తామని, అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్ వివరించారు.

మరిన్ని వార్తల కోసం...
* నేటినుండి తెలంగాణ స్కూళ్లకు సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి 
* స్కిన్_పిగ్మెంటేషన్‌కు ఆయుర్వేద పరిష్కారాలు ఇక్కడ క్లిక్ చేయండి
* బొప్పాయి పండును వీళ్లు అస్సలు తినకూడదు.. తిన్నారంటే వీళ్ల పని అంతే ఇక్కడ క్లిక్ చేయండి
* వికసిత భారత్‌ లక్ష్య సాధనకు యువతే కీలకం ఇక్కడ క్లిక్ చేయండి
* పనుల మీద కంటే ప్రచారం మీద ద్రుష్టిపెడితే మేమె గెలిచేవాళ్ళం : కేటీఆర్ ఇక్కడ క్లిక్ చేయండి
* సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies