ఆరోగ్యం మందులు అవసరం లేని వైద్య విధానం ఏమిటి?
ఆరోగ్యం Health : మందులు అవసరం లేని వైద్య విధానం ఏమిటి అవగాహనా కోసం వైద్య నిలయం సలహాలు మన శరీరానికి వచ్చే సమస్యలను రాకుండా చేసేది లేదా తగ్గించేది వైద్యం. మనకు అల్లోపతి, ఆయుర్వేదం అంటూ చాలా వైద్యవిధానాలే అందుబాటులో ఉన్నాయి. కానీ సహజంగా మందులు అనేది అవసరమే లేని వైద్య విధానం ఏది అని అడిగితె గనక అది మన జీవన శైలి మరియు సరైన డైట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన జీవన శైలి సరిగ్గా ఉంటుందో సరైన పోషకాలు ఉన్న ఆహారం మనకు అందుతుందో సగం సమస్యలు రావటం మానేస్తాయి మిగతావి తగ్గిపోతాయి.1అందుకే రోజూ ఉదయం లేచినప్పటినుండి వ్యాయామం,యోగా వంటివి చేస్తూ పాజిటివ్ గా ఉంటూ 2ఎటువంటి దురలవాట్లకు అవకాశం ఇవ్వకుండా సమయానికి మితంగా సహజ పౌష్టిక ఆహారం తింటూ ఆనందంగా రోజు గడిపి ప్రశాంతంగా నిద్ర పోవడమే శరీరానికి సరైన సహజ వైద్యం. ఈ సహజ వైద్య విధానం సమస్యలను తగ్గించడమే కాకుండా సమస్యలను దరిచేరనివ్వదు.5మంచి వ్యాయామం మంచి భోజనం మంచి నిద్ర మంచి ఆలోచన ఇవే మందులు అవసరం లేని సహజ వైద్య విధానాలు.