Type Here to Get Search Results !

Sports Ad

ఆయుర్వేదంలో అతిమధురం చూర్ణం ఉపయోగం ఏమిటి What is the use of Athimadhuram Churnam in Ayurveda Medical advice for understanding


 ఆయుర్వేదంలో అతిమధురం చూర్ణం ఉపయోగం ఏమిటి

ఆరోగ్యం Health : యుర్వేద వైద్య విధానంలో అత్యంత తీయని రుచి కలిగి అత్యంత శక్తివంతమైన ఔషధాల్లో అతి మధురం అగ్రస్థానాన్ని పొందిందంటే అతిశయోక్తి కాదు.  అతి మధురం, గుమ్మడి, రోజు పూలు, సోపు గింజలు మొదలైన వాటితో ఒక ఔషధాన్ని రూపొం దించి, ఎలుకలపై ప్రయోగించి పరి శోధించారు. జీర్ణా శయంలోని వ్రణాన్ని మార్చడమే కాక, ఇతర ఆధునిక ఔషధాలతోపాటు దీనిని కూడా వాడటం వల్ల ఆ వ్రణం మానే ప్రక్రియ శీఘ్రతరమైనట్లు గుర్తించారు. అలాగే ఆధునిక ఔషధాల దుష్పరిణామాలు తగ్గడాన్ని కూడా గుర్తించారు. పచారి కొట్లలోను, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లోనూ లభించే ఈ మొక్క వేళ్లు, వేళ్ల చూర్ణాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు.

ఔషధోపయోగాలు

1 అతి మధుర చూర్ణంలో సగభాగం వచ చూర్ణం కలిపి పూటకు పావు స్పూను వంతున మూడు పూటుల తగినంత తేనెతో కలిపి తీసుకుంటే వివిధ రకాలైన దగ్గులు తగ్గుతాయి.

2.అతిమధురం, అశ్వగంధ, శుంఠి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, అరస్పూను నుంచి ఒక స్పూను వరకూ అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే కీళ్లు, కండరాల నొప్పులు, ఒంట్లో నీరసం తగ్గి హుషారుగా ఉంటారు.

3.సోపు గింజల చూర్ణానికి రెట్టింపు అతి మధురం, పటికబెల్లం కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తే కడుపు ఉబ్బరం, దగ్గు, ఆయాసం, త్రేన్పులు తగ్గుతాయి.

4. అతి మధుర చూర్ణాన్ని మూడు పూటలా పూటకు ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే అధిక దాహం, ఎక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట, అధిక వేడి, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.

5 అరకప్పు పాలలో కలిపి సేవిస్తుంటే బాలింతల్లో స్తన్యవృద్ధి జరుగుతుంది.బియ్యం కడుగు నీళ్లతో సేవిస్తే నోరు, ముక్కు మొదలైన భాగాలనుంచి కారే రక్తస్రావం, స్త్రీలలో అధిక బహిష్టు రక్తస్రావం తగ్గుతాయి.జీర్ణాశయ, గర్భాశయ, శ్వాసకోశ వ్యాధులకు వాడే ఔషధాల్లో అతి మధురాన్ని ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు.

6 అతి మధుర చూర్ణంతో పళ్లు తోముకుంటే పిప్పిపళ్లు, చిగుళ్లనుంచి రక్తస్రావం, నోటి పుళ్లు, నోటి దుర్వాసన తగ్గుతాయి.

7.అతి మధుర చూర్ణం, ఎండు ద్రాక్ష సమానంగా కలిపి దంచి ముద్ద చేసి ఉంచుకుని, రోజూ రెండుసార్లు పూటకు పది గ్రాముల చొప్పున చప్పరించి కప్పు పాలు సేవిస్తుంటే స్త్రీలలో రక్తహీనత వల్ల కలిగే నీరసం, ఆయాసం, అలసట, గుండె దడ, మలబద్ధకం తగ్గు తాయి.

8. రుతురక్తం సక్రమంగా పద్ధతిలో, సరైన ప్రమాణంలో వెలువడుతుంది. అధిక రుతుస్రావం తగ్గు తుంది. సుఖ ప్రదమైన నిద్ర కలుగుతుంది.

అతి మధురం, ఆకుపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఒక స్పూను వంతుగా రోజూ రెండుపూటలా అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే మనో వ్యాకులత తగ్గి మనో నిబ్బరం, మానసిక ప్రశాంతత, మానసిక ఉత్తేజం కలుగుతాయి.

9. అతి మధుర చూర్ణాన్ని గాయాలు, వ్రణాలు, పుళ్లపై చల్లుతుంటే రక్తస్రావం తగ్గి శీఘ్రంగా మానుతాయి.

10. అతి మధురం, కరక, తాని, ఉసిరిక చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, ఉదయం, సాయంత్రం రెండుపూటలా సేవిస్తుంటే నేత్ర దోషాలు తగ్గి కంటి చూపు మెరుగవుతుంది.

11. అతి మధురం, సరస్వతి ఆకు, అశ్వగంధ, పటిక బెల్లం చూర్ణాలను సమానంగా కలిపి రెండుపూటలా పావుస్పూను నుంచి స్పూను వరకూ మోతాదుగా అరకప్పు పాలతో సేవిస్తుంటే మెదడుపై ప్రభావం చూపి మతి మరుపు తగ్గి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

12. అతి మధురం, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, గ్లాసు పాలలో ఒక స్పూను చూర్ణం, ఒక స్పూను వంటున పటికబెల్లం పొడి, నెయ్యి, తేనె కలిపి రోజూ ఒకటి రెండుసార్లు తాగుతుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగడమే కాక, లైంగిక కార్యం తరువాత కలిగే నీరసం, నిస్సత్తువ, కండరాలు బిగదీసుకున్నట్లు ఉండే ఇబ్బందులు తొలగుతాయి.

12. మధుమేహ వ్యాధిగ్రస్తులు అతి మధురం వాడే విషయంలో వైద్యుల సలహాలను అనుసరించాల్సి ఉంటుంది.

13.అతిమధురం చూర్ణానికి అవసరమైనంత చక్కెర కలిపి, రోజుకు రెండు సార్లు, రెండు స్పూన్ల చొప్పున సేవిస్తుంటే ఎలర్జీ, దద్దుర్లు తగ్గుతాయి.14. పొగతాగడం వల్ల వచ్చే దగ్గును తొలగించడంలో అతిమధురం సమర్థంగా పనిచేస్తుంది.15.కత్తులతో తగిలిన గాయాలను మాన్పడంలో అతిమధురం బాగా పనిచేస్తుంది.16 అతి మధురం చూర్ణాన్ని తేనెతో గానీ, పాలతో గానీ సేవిస్తే, వైరల్‌ జ్వరాలు తగ్గుతాయి. ఎసిడిటి, అల్సర్‌, IBS మలబద్దకం, రక్తనాళాల సమస్యలు, జుత్తురాలడం, చర్మరోగాల వంటివి ఉంటే, ఒక్కో వ్యాధికి ఒక్కో ఔషధం వాడే అవసరం లేకుండా, అతిమధురం వాడటం ఉత్తమం.ఒకటి రెండుకన్నా మించి వ్యాదులు ఉన్న వారికి అతిమధురం నిజంగా ఒక వరప్రసాదమే.

మరిన్ని వార్తల కోసం... 
* అయోధ్యలో వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ఇక్కడ క్లిక్ చేయండి
* ఆయుర్వేదంలో అతిమధురం చూర్ణం ఉపయోగం ఏమిటి అవగాహనా కోసం వైద్య సలహాలు ఇక్కడ క్లిక్ చేయండి
* రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏది? అవగాహనా కోసం వైద్య నిలయం సలహాలు ఇక్కడ క్లిక్ చేయండి
* అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు  ఇక్కడ క్లిక్ చేయండి
* ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు? ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies