రెండు రోజుల్లో 11వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : మరో రెండు రోజుల్లో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.దాదాపు 11 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత ప్రభుత్వం 5089 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది.ప్రభుత్వ బడుల్లో చదు వుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను కూడా ఈ నోటిఫి కేషన్ లోనే రిక్రూట్ చేయనుంది.