17వ తేదీ నుంచి సదరం క్యాంప్
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికలాంగులకు సదరం క్యాంపుకు సంబంధించి శనివారం ఈ నెల 17న ఉదయం 11.00గంటల నుండి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19,20,23,26,27 మరియు మార్చ్ 08,09,16,19,30,తేదీల్లో తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్న అంగ వైకల్యం,బుద్ధి మద్యం,చెవుడు మూగ గల దరఖాస్తుదారులు హాజరుకావాలని అయన తెలిపారు.అదేవిదంగా ఈ నెల 20,21,23,27 మరియు మార్చ్ 06,22,26,27,ల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు నిర్వహించే క్యాంపులకు అంగ వైకల్యం,హంగులు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.ఇట్టి కాయంపులకు సదరం సర్టిఫికెట్ పొంది సర్టిఫికెట్ కాలపరిమితి అయిపోయిన వారితో పటు కొత్తగా కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్నవారు హాజరుకావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.