Type Here to Get Search Results !

Sports Ad

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రేవంత్ రెడ్డి We will fill 2 lakh jobs within a year: Revanth Reddy


 ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రేవంత్ రెడ్డి 

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  తెలిపారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ త్వరలో 15వేల పోలీసు ఉద్యోగాలూ భర్తీ చేయనున్నట్టు చెప్పారు.విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.స్టాఫ్‌ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూసే ప్రభుత్వం ఇది. 

     ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వారిదే కీలకపాత్ర. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదు.గత ప్రభుత్వం వాళ్ల కుటుంబసభ్యుల గురించి మాత్రమే ఆలోచించింది. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించింది. కుమార్తెను ప్రజలు ఓడిస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి కేసీఆర్‌ ఆలోచించలేదు.ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త ఛైర్మన్ సభ్యులను నియమించాం. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* పునర్నవ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ? ఇక్కడ క్లిక్ చేయండి
* మగవారి కోసం ప్రత్యేక బస్సులు? ఇక్కడ క్లిక్ చేయండి
* పాప ప్రాణాలు కాపాడిన ప్రజావాణి ఇక్కడ క్లిక్ చేయండి
* సర్పంచుల పదవి కలం పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies