36 పంచాయతీలకు 7గురు ప్రత్యేకాధికారులు నియమించారు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీలకు గాను 7 గురు ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రస్తుతం జనవరి 31వ తేదిన గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీలో సెక్రటరీ మాత్రమే ఉన్నారు.ఎంపీడిఓ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం అయితే గ్రామ పంచాయతీల పనులు నడిపిచేందుకు ప్రభుత్వం సర్పంచ్ స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించాలని ఆదేశించడంతో ప్రస్తుతం మండలంలోని గ్రామ పంచాయతీలో బాత్లాపూర్, బాదాపూర్ తండా, బషీరాబాద్, బొజ్జ నాయక్ తండా పంచాయతీలకు ఈఈ పిఆర్ తాండూరు రాములను, దామర్చేడ్,ఎక్మాయి, గోటుగకలాన్, రెడ్డిఘనాపూర్ వాల్యా నాయక్ తండా,జలాల్పూర్,
జీవని పంచాయతీలకు బషీరాబాద్ ఎంపీడిఓ రమేష్,గోటుగ కుర్దు, హంక్యా నాయక్ తండా, ఇందర్ చేడ్, ఇస్మాయిల్ పూర్ గ్రామాలకు డి. విజయ్ కుమార్ డివైఈఈ తాండూరు, మైల్వారం,మాంసన్ పల్లి, మంతన్ గౌడ్, మంతన్ గౌడ్ తండా, మంతటి గ్రామాలకు బషీరాబాద్ ఎంఆర్డీ వెంకటస్వామి, బాబు నాయక్ తండా, కంసాన్పల్లి, కాశీంపూర్లకు బషీరాబాద్ డిప్యూటి తహసీల్దార్ వెంకటయ్య, కొర్విచేడ్, కొర్విచేడ్ గని కొత్లాపూర్, కుప్పంకోట, క్యాదిర్గా పంచాయతీలకు వ్యవసాయాధికారి సూర్య ప్రకాష్, మర్పల్లి, నంద్య నాయక్ తండా, నవల్గా, నవాంధ్ధి, నీళ్లపల్లి, పర్వతపల్లి గ్రామ పంచాయతీలకు పశువైద్యాధికారి హతి రామ్ నియమించారు. మొత్తం 36 గ్రామ పంచాయతీలకు గాను పైన తెలుపబడిన ఏడు మంది ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు.