‘గృహ జ్యోతి’ కి ఆధార్ తప్పనిసరి... బయోమెట్రిక్ పని చేయకుంటే ఐరిస్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ‘గృహ జ్యోతి’లబ్ధిదారులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసమే ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని క్షేత్ర స్థాయిలో డిస్కంలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. డిస్కంలకు చెందిన సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు కచ్చితంగా ఆధార్ చూపించాలని సూచించింది. అలాగే బయోమెట్రిక్‌ను తీసుకుంటారని, అది సరిగ్గా పనిచేయకుంటే ఐరిస్‌ను స్కాన్ చేస్తారని తెలిపింది. అదీ సాధ్యం కాకుంటే ముఖాన్ని ఫొటో తీసుకుంటారని ఉత్తర్వుల్లో వివరించింది. ఇవన్నీ సాధ్యం కానీ పక్షంలో లబ్ధిదారుడి ఆధార్ క్యూఆర్ కోడ్ సహాయంతో వివరాలు తెలుసుకోనున్నట్లు వెల్లడించింది.