చలికాలంలో కీళ్ళ వాపు,నొప్పులతో బాధపడుతున్నారా ఇది మీకోసమే...
ఆరోగ్యం Health : చలికాలంలో జలుబు, దగ్గు తో పాటు కీళ్ల నొప్పులు కూడా బాధిస్తాయి.వాటి నుంచి బయట పడటానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.కానీ ఏ ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.ఆ చిట్కాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ కాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి.అలాగే పచ్చి ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు,వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు వివరంగ తెలుసుకుందాం.శీతాకాలంలో కాళ్ల వాపులు, నొప్పులతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడే అనేక పోషకాలు పచ్చి ఉల్లిపాయలో ఉన్నాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మొదలగునవి ఇందులో ఉంటాయి.జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఉల్లిపాయ జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.. అంతేకాదు జలుబు, దగ్గుతో పోరాడడంలో సహాయపడతాయి.విటమిన్ సి శరీర ఇన్ఫెక్షన్లు, వైరస్లతో పోరాడటానికి సహాయపడుతుంది.గుండె సంబంధిత సమస్యలను కూడా ఉల్లి తగ్గిస్తుంది.చర్మాన్ని పగలకుండా అలాగే జుట్టు రాలడంను కూడా తగ్గిస్తుంది.