గిరాకీ లేక పూటగడవడం లేదని ప్రజాభవన్ వద్ద ఆటోకు నిప్పు పెట్టిన ఆటోడ్రైవర్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి: పంజాగుట్ట గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానంటూ ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో తన ఆటోకు ప్రజాభవన్ ముందుకు నిప్పు పెట్టిన ఘటన ఇది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌కు చెందిన దేవ్లకు భార్య ముగ్గురు పిల్లలున్నారు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి మియాపూర్‌లో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇటీవల ఆటోకు కిరాయి సరిగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని గురువారం సాయంత్రం ఆటోని ప్రజాభవన్ వద్దకు తీసుకుచ్చాడు. సరిగ్గా 7 గంటల సమయంలో ఆటోపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టాడు దీంతో ఆటో మంటల్లో కాలిపోయింది ఈ క్రమంలో ఆటోకు సమీపంలోకి వెళ్లేందుకు దేవ్ల ప్రయత్నించగా పోలీసులు వారించారు ఆటోపై నీళ్లు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గిరాకీ లేక పూటగడవడమే కష్టంగా ఉందని దేవ్ల వాపోయాడు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.