రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
కొడంగల్ Kodangal News భారత్ ప్రతినిధి : దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా గ్రామీణ బందును కొడంగల్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విద్యుత్ చట్టాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని విరమింప చేసి నేటికీ అమలు చేయకపోగా తమ డిమాండ్ల సాధనకై ఢిల్లీ ఢిల్లీకి వస్తున్న రైతులపై యుద్ధము ప్రకటించడాన్ని ,సిపిఐ పార్టీ కొడంగల్ శాఖ ఖండిస్తున్నది. . ఇట్టి సమావేశం ద్వారా కేంద్రం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడమేమనగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగా సంస్థలను ప్రైవేటీకరించడం ఆపాలని ఉపాధి హామీ కొనసాగిస్తూ మున్షి మున్సిపాలిటీ పట్టణాలకు విస్తరింప చేయాలని 2021లో తెచ్చిన గెజిట్ చేసి అమలు పరచాలని స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని సంగటిత రంగా కార్మికులకు సామాజిక బాధ్యత చట్టాన్ని తీసుకురావాలని పెట్రోల్
డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని 1995 పెన్షన్ చట్టాన్ని అమలు చేయాలని పౌర నిర్మాణంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పదివేల పెన్షన్ చెల్లించాలని నూతన జాతీయ విద్యా విధానం 2020 ని రద్దు చేయాలని కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించి 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా చేయుట ను విరమించుకోవాలని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కొడంగల్ నియోజకవర్గ సిపిఐ పార్టీ నిరసన చేయడం ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి మహమ్మద్ గారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహీం గారు, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఇందనూర్ బషీర్ గారు, మండలాల కార్యదర్శులు. మూతుల రాజు శ్యాంసుందర్ ,గౌరారం లక్ష్మణ్ ,ఎర్ర రాజు, ఏఐవైఎఫ్ నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.