రేపు మేడారం సీఎం రేవంత్ రెడ్డి రాక CM Revanth Reddy's arrival in Medaram tomorrow
Bharath NewsFebruary 22, 2024
0
రేపు మేడారం సీఎం రేవంత్ రెడ్డి రాక
హైదరాబాద్ Hyderabad Newsభారత్ ప్రతినిధి : ఆసియాలో అతి పెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న వెళ్ళను న్నారు. ఇందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లు చేశారు.మేడారం జాతర బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ జాతర ఈ నెల 24 వరకు కొనసాగు తోంది. రెండేళ్ళకొకసారి జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే గాకుండా వివిధ రాష్టాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ముఖ్యమంత్రి రాక సంధర్భంగా అధికారు లు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా జాతరకు వస్తున్నందున అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.