కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : పట్నం సునీత మహేందర్ రెడ్డి
* సునీత రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ధర్మన్న గారి వెంకటరెడ్డి
* ఫతెపురం టిఆర్ఎస్ ఖాళీ
శంకర్పల్లి Shankarpalli News భారత్ ప్రతినిధి : ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం స్వర్గముఖాభివృద్ధి చెందుతుందని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామే భరత్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధర్మన్న గారి వెంకటరెడ్డి, టిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు సునీత రెడ్డి సమక్షంలో తమ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శంకర్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బి. వెంకట రామారెడ్డి కౌన్సిలర్ సంతోష్ రాథోడ్, బిజెపి కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, శంకర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎస్. శ్రీకాంత్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు బి. భరత్ రెడ్డి, బిజెపి నాయకుడు బలవంత్ రెడ్డి లతోపాటు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా సునీత రెడ్డి, భీమ్ భరత్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అమలుపరుస్తున్న ఆరు గ్యారెంటీలతో జరగనుందని చెప్పారు.
రానున్న రోజుల్లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో కని విని ఎరగని రీతిలో వేల కోట్లతో అభివృద్ధి సాగుతుందని సునిత మహేందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. భీమ్ భరత్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కార్యదర్శి రవీందర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహబూబ్, ఉపాధ్యక్షుడు నసీరుద్దీన్, సీనియర్ నాయకుడు ఉదయ మోహన్ రెడ్డి, ఎం డి ఎజాజ్, యూత్ కాంగ్రెస్ యువనేత పట్నం రినీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సునీత రెడ్డి భీమ్ భరత్ సమక్షంలో ఫతేపురం గ్రామానికి చెందిన 100 మంది ధర్మాన గారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డి. గణేష్ రెడ్డి కడిగళ్ల శ్రీకాంత్, డి .యాదిరెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ దాదాపుగా లేకుండా పోయిందని గ్రామస్తులు చెప్పారు.