ఈ కేవైసి తప్పకుండ చేయించండి : తహశీల్ధార్ వెంకటేశం
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల తహశీల్ధార్ కార్యాలయంలో వివిధ గ్రామపంచాయితీల రేషన్ డీలర్లతో గురువారం రోజు తహశీల్ధార్ వెంకటేశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా రేషన్ డీలర్లను పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తహశీల్ధార్ వెంకటేశం మాట్లాడుతూ రేషన్ బియ్యం కి సంబందించిన రిజిస్టర్ వివరాలు సక్రమంగా ఉండాలి, రేషన్ కార్డులో ప్రతి ఒక్కరు పేరు ఉన్నవారు ఈ కేవైసి తప్పకుండ చేయించాలి,రేషన్ డీలర్లలా లైసెన్సులు చేయించని వారురెన్యువల్చేసుకోవాలి, 36 గ్రామపంచాయితీలో ఎటువంటి అవకతవకలు లేకుండా నిరుపేద కుటుంబాలకు రేషన్ బియ్యం సక్రమంగా అమలు చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపతహసీల్ధార్ వెంకటయ్య,డీలర్ సునీల్ ప్రసాద్ వివిధ గ్రామాల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.