Type Here to Get Search Results !

Sports Ad

కొత్త ఆర్వోఆర్ చట్టానికే మొగ్గు.. ధరణికి గుడ్ బై! Favoring the new RVR Act.. Goodbye to Dharani!


 కొత్త ఆర్వోఆర్ చట్టానికే మొగ్గు.. ధరణికి గుడ్ బై!

* కలెక్టర్లతో చర్చించే అంశాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రభుత్వం ధరణి పోర్టల్ ధరిద్రాన్ని వదుల్చుకునేందుకే యత్నిస్తున్నది. ఐతే ఆర్వోఆర్ 2020 యాక్టు సవరణల కంటే కొత్త చట్టాన్ని రూపొందించుకోవడానికే మొగ్గు చూపిస్తున్నదిఒకటీ రెండు సవరణలతో మెరుగైన సేవలందించే అవకాశం లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి అంశంలోనూ మార్పులు అనివార్యంగా మారిన నేపథ్యంలో కొత్త భూ పరిపాలన దిశగా అడుగులు వేయడం ద్వారా చిక్కులు ఎదురుకావని యోచిస్తున్నారు.ఆర్వోఆర్ యాక్టు సవరణల జాబితా చాంతాడంతగా మారుతున్నది. అందుకే ఈ నెల 24న 33 మంది కలెక్టర్లతో ధరణి కమిటీ కీలక సమావేశం కానున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 10.30 గంటల నుంచి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించనున్నారు. ఇన్ని రోజులుగా గుర్తించిన ప్రతి ఇష్యూపైనా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నలుగురు కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై ధరణి పోర్టల్ పనితీరు, సాంకేతిక లోపాలు, పనిలో వేగం, సవరణల వంటి అనేకాంశాలపై డిస్కస్ చేశారు. ఇప్పుడన్నింటిపైనా చర్చించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ధరణి కమిటీ నిర్ణయించింది. కలెక్టర్లతో ధరణి కమిటీ సభ్యులు ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్), రేమండ్ పీటర్, ఎం.కోదండరెడ్డి, మధుసూదన్‌లు మాట్లాడనున్నారు. వీరితో పాటు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎమ్మార్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డిలు పాల్గొననున్నారు. 

     కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత వారం రోజుల్లో రిపోర్ట్‌ని సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి సమర్పించనున్నట్లు తెలిసింది. ఐతే కొత్త చట్టం లేదా చట్ట సవరణ అనివార్యం కానున్న నేపధ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోంటుందో వేచి చూడాలి కలెక్టర్లతో చర్చించే అంశాలు ధరణి పోర్టల్‌లో పెండింగ్ అప్లికేషన్లు, కారణాలు. వాటిని పరిష్కరించేందుకు మార్గాలు నిషేదిత జాబితా, అభ్యంతరాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అడహక్ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు ద్వారా కేసుల పరిష్కారానికి మార్గాలు సాదాబైనామా దరఖాస్తుల స్టేటస్ ఆర్ఎస్ఆర్/సేత్వార్ విస్తీర్ణంలో తేడాలు. వాటికి పరిష్కార మార్గాలు తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టాలి. దానికి గాను ఆర్వోఆర్ యాక్టు సవరణలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో తలెత్తుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలు భూ వివాదాలు/ సమస్యలు. ఆర్వోఆర్ యాక్ట్ ద్వారా తలెత్తిన కేసులు. ఇనాం, జాగిర్, ఎవాక్యూ ప్రాపర్టీస్.. ఇలాంటి పెండింగ్ ఇష్యూస్ కి కలెక్టర్ దగ్గరున్న మార్గాలు గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యలకు పరిష్కారాలు రెవెన్యూ, అటవీ భూముల వివాదాలు ఎండోమెంట్, వక్ఫ్ ల్యాండ్స్ పరిరక్షణ. సమస్యలు, వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మెరుగైన భూ పరిపాలన అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? వంటి అంశాలను చర్చించనున్నారు. 

మరిన్ని వార్తల కోసం... 
* ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌! ఇక్కడ క్లిక్ చేయండి 
* అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు.. ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌... డీలర్లుకు స్పష్టం చేసిన పౌరసరఫరాల శాఖ ఇక్కడ క్లిక్ చేయండి
* రాళ్లురప్పలకు రైతుబంధు..22 వేల కోట్లు.. తెలంగాణ రైతుబంధు లెక్క ఇదే ఇక్కడ క్లిక్ చేయండి
* కొత్త ఆర్వోఆర్ చట్టానికే మొగ్గు.. ధరణికి గుడ్ బై! ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies