Type Here to Get Search Results !

Sports Ad

జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ General ranking should be announced and jobs should be filled: RS Praveen Kumar


 జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) ఉద్యోగ నియామకాల్లో రీలింకిష్‌మెంట్‌ విధానం పాటించి.. అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని బీఎస్పీ సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ‘ఎక్స్‌’ వేదికగా లేఖ రాశారు.గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిలిస్తున్నాయి. గత ఏడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్స్‌, పీజీటీ, టీజీటీ వంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది. అర్హత కలిగిన వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాశారు. 

   బోర్డు వెల్లడించిన అన్ని ఫలితాల్లో ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలా ఎంపికైన వారు ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతావి వదిలేయాల్సి ఉంటుంది.అలా వదిలేసిన ఉద్యోగాలు ఖాళీగానే ఉండిపోతున్నాయి. దీంతో మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుంది. బోర్డు తక్షణమే జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరోవైపు, ఉద్యోగాలు ఖాళీగా మిగలకుండా ఉండాలంటే అభ్యర్థుల మెరిట్ ఆధారంగా రెండో జాబితా విడుదల చేసి భర్తీ చేపట్టాలి’’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కోరారు.

మరిన్ని వార్తల కోసం... 
* మహిళలకు కుట్టు మిషిన్స్,వికలాంగులకు విల్ చైర్స్ అందించిన సి.జి.యం రాజేష్ కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి
* జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* ‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు... రేపు తెలంగాణాలో తేలికపాటి వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* 36 లక్షల రైతుబంధు నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ ఇక్కడ క్లిక్ చేయండి
* ఉచితంగా 3 లక్షల లోన్ వెంటనే అప్లికేషన్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* గ్యాస్‌ కరెంట్ పథకాలు ప్రారంభం ఆ రోజే... సీఎం రేవంత్ ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies