కృష్ణవేణి త్రివేణి విద్యాసంస్థల క్రిష్ కలర్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యస్.బి.ఐ మేనేజర్ జగన్
* జగన్ కి ఘనంగా స్వాగతం పలికిన విద్యాసంస్థల యాజమాన్యం
భద్రాద్రి కొత్తగూడెం Bhadradri Kothagudem News భారత్ ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం కృష్ణవేణి - త్రివేణి విద్యాసంస్థల అధినేతలు కోటేశ్వరరావు,వెంకటేశ్వర్లు,వీరేంద్ర చౌదరి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిష్ కలర్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యానగర్ కాలనీ యస్.బి.ఐ మేనేజర్ బాదవత్ జగన్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు ఇప్పటి నుండి కష్టపడి చదివితే రేపటి భావితరాలకు ఉపయోగపడతారు.,నిను కూడా ఒకప్పుడు ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ నీ గుర్తుచేశారు,ప్రతి రోజూ కాలేజ్ కి వచ్చి ఉపాద్యాయులు చెప్పే విద్య బోధనలు మనసులో పెట్టుకొని
ఇంటికి వెళ్ళి మరల ఒక సారి పునరావృతం చేసుకోవాలని ఈ రోజు ప్రతి విద్యార్థి,విద్యార్థినిలు కష్టపడి చదివితే రేపటి రోజు పోలీస్,డాక్టర్,లాయర్,బ్యాంక్ మేనేజర్ ఇల అనేక బాధ్యత కల వృత్తి లో రాణిస్తారని,ఉపాద్యాయులు కోపగించుకున్నరని విద్యను అశ్రద్దా చేస్తే విద్యార్థులు మీరే నష్టపోతారని,మన మంచికే చెప్తున్నారని ఆలోచించి మీరు ముందుకు వెళితే మి జీవితం బంగారు భవిష్యత్తు గా తీర్చపడుతుందినీ తెలిపారు. అనంతరం యాజమాన్యం జగన్ సన్మానించి భాహుకరణ అందించారు.