నా కట్టె కాలేదాక తెలంగాణ హక్కుల కోసం పులిలా కొట్లాడుతా.. నల్లగొండ సభలో కేసీఆర్ రణ గర్జన
* నీళ్లు లేకపోతే మన బతుకు లేదు
* జీరో ఫ్లోరైడ్ నల్లగొండను చేసిందే బీఆర్‌ఎస్
* వారందరికీ ఇది హెచ్చరిక సభ
* మనల్ని రక్షించేందుకు ఎవ్వడూ రాడు
* ప్రభుత్వం భద్రప్పలెక్క వెళ్లి సంతకం పెట్టింది
* కేంద్రంతో కొట్లాడి ప్రాజెక్టులు చేపట్టినం
నల్లగొండ Nalgonda News భారత్ ప్రతినిధి : నీళ్లు లేకుంటే మనకు బతుకేలేదు.. ఇది జీవన్మరణ సమస్య ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే.. చిప్పపట్టి అడుక్కోవాలె కృష్ణా నీళ్లలో సంపూర్ణ వాటా దక్కేదాక పోరాటం ఆగదు నీళ్ల వాటా విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి దొంగమాటలు చెప్పి తప్పించుకుంటమంటే కుదరదు మొగోడైతే కేంద్ర సర్కారుతో, ట్రిబ్యునల్‌తో పోరాడాలె ఆర్నెల్లలో వాటాల లెక్క తేల్చాలె.. హక్కు చూపాలె: కేసీఆర్ ఐదేండ్లు అధికారంలో ఉండండి.. మాకు అభ్యంతరం లేదు దమ్ముంటే మేం చేసినదానికన్నా మంచిగ జేసి చూపాలె ఇది ఒకప్పటి ఎడ్డి తెలంగాణ కాదు.. టైగర్ తెలంగాణ కరెంటుకు, నీళ్లకు ఇబ్బందిపెడితే ఎక్కడికక్కడ నిలదీస్తం వదిలిపెట్టం.. ప్రజాక్షేత్రంలో వెంబడపడుతం, వేటాడుతం తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను తెలంగాణల తిరగనీయరట.ఏం సంపుతరా? దా.. నన్ను సంపి మీరు ఉంటరా? డబుల్ స్పీడ్‌తో మేం మళ్లా అధికారంలోకి వస్తం రాజకీయ సభ కానే కాదిది.. ఉద్యమ సభ, హెచ్చరిక సభ పదవులు, పైరవీలు, పైసలే తప్ప వాళ్లకేనాడూ ప్రజలు పట్టలె కేసీఆర్‌ను తిడితే, బదనాం చేస్తే మీరు పెద్దోళ్లవుతరా? అధికారం శాశ్వతం కాదు, తెలంగాణ హక్కులు శాశ్వతం వాళ్లకు నిధుల మీద అవగాహన లేదు.. నీళ్ల మీదా లేదు ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: కేసీఆర్ మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినయ్. నాగార్జునసాగర్‌లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టులో గేట్లు కొట్టుకు పోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు సక్కగా ఉండెనా? కొట్టుకుపోలేదా? ఏదన్నయితే సదరాలి.
మంచిగ చేసి, రైతులకు నీళ్లు ఇయ్యాలె. ఇది రాజకీయమా? గోదావరి ప్రధాన ఉపనదే ప్రాణహిత. ఇయ్యాల కూడా ఐదు వేల క్యూసెక్కుల నీళ్లొస్తున్నయ్. అది ఎత్తిపోయాలె. కాఫర్‌డ్యామ్ పెట్టి కూడా నీళ్లు ఎత్తి పోయెచ్చు. ఎల్‌ఎండీ నింపాలె. రైతులకు నీళ్లియ్యాలె. కానీ వాళ్లేం చేస్తున్నరు? మేడిగడ్డకు పోతాం. బొందలగడ్డకు పోతాం అంటున్నరు. మేడిగడ్డ కాడ ఏం ఉన్నది? అసెంబ్లీ అయిన తర్వాత మీ బండారం బయటపెడుతం. అసెంబ్లీ తర్వాత మేం కూడా మేడిగడ్డ పోతం. మీ చరిత్ర ఎండగడుతం. కేసీఆర్‌ను బదనాం చేయాలనే దుష్టబుద్ధి పెట్టుకుని రైతుల పొలాలను ఎండగొడ్తరా? – కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా తేలేదాకా బీఆర్‌ఎస్ పోరాటం ఆపబోదని ఆ పార్టీ అధినేత కే చం ద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. ప్రతి తెలంగాణ బిడ్డ తమ హక్కుల కోసం పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 'నల్లగొండ సభ రాజకీయ సభ కానే కాదు. ఇది ఉద్యమ సభ, పోరాట సభ, తెలంగాణ నీళ్లను దోచుకునే ప్రయ త్నం చేసేవాళ్లకు ఇది హెచ్చరిక సభ' అని స్పష్టం చేశా రు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే
నీళ్లు లేకపోతే మన బతుకు లేదు నాకు కాలు ఇరిగినా ఇంత ఆయాసంతో కుంటి నడకతో ఎందుకు రావాల్సి వచ్చింది? చలో నల్లగొండ కార్యక్రమం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇది కొందరికీ రాజకీయం కావొచ్చు.. కానీ ఇది రాజకీయ సభ కానే కాదు.. ఇది ఉద్యమ సభ, పోరాట సభ. కృష్ణా నీళ్లపై మన హక్కులు.. మనందరి బతుకులకు జీవన్మరణ సమస్య. 24 ఏండ్ల నుంచి తెలంగాణ అంతటా పక్షిలా తిరుగుతూ ఈ మాట చెప్తున్నా. కృష్ణ, గోదావరి జలాలు కావొచ్చు. నీళ్లు లేకపోతే మన బతుకు లేదు. నీళ్లు లేక నల్లగొండలో బతుకులు వంగిపోయాయి. జీరో ఫ్లోరైడ్ నల్లగొండను చేసిందే బీఆర్‌ఎస్ ఫ్లోరైడ్ కారణంగా మునుగోడు, దేవరకొండతోపా టు ఇతర ప్రాంతాల లక్షన్నర మంది బిడ్డల నడుములు వంగిపోయినవి. ఉద్యమకారులంతా ఫ్లోరైడ్ బాధిత బిడ్డల్ని తీసుకెళ్లి ప్రధాని టేబుల్‌పై పడుకోబెట్టి 'అయ్యా మా బిడ్డల బతుకిది' అంటే కూడా పట్టించుకునేవాడే లేడు. ఆనాడు పార్టీలు లేవా? మంత్రులు లేరా? ఎమ్మెల్యేలు లేరా? ఎవడూ పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లగొండను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చినం. ఫ్లోరైడ్ రహిత నల్లగొండను చేసిందే బీఆర్‌ఎస్ పార్టీ. ఇప్పుడు ఎవరిని అడిగినా భగీరథ నీళ్లు వచ్చినంక ఆ బాధలు పోయినయని చెప్తున్నారు.
వారందరికీ ఇది హెచ్చరిక సభ ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర నాయకులకు, నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, కేంద్ర ప్రభుత్వాని కి, కేంద్ర నీటిపారుదలశాఖ మంత్రికి, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఒక హెచ్చరిక. ఇది ఏ ఒక్కడి గురించో, కొద్దిమంది గురించో పెట్టిన స భ కాదు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఐదు జిల్లాల ప్రజల జీవన్మరణ సమ స్య. మీ అందరి ఆశీస్సులతో ఉద్యమాన్ని విజయవం తం చేసి రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనలతో పదేండ్లు ఈ గడ్డను పరిపాలించిన. నేనేం తక్కువ చేయలేదు. ఎక్కడికో పోయిన కరెంట్‌ను గాడిలో పెట్టి నిమి షం కూడా కరెంట్ పోకుండా సరఫరా చేసినం. ప్రతి ఇంటిలో నల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చినం. ఒకప్పుడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో, బత్తాయి తోటలతోనే బతికిన నల్లగొండలో లక్షల టన్ను ల వడ్లు పండించే పరిస్థితులు తెచ్చినం. అంతకు ముం దు లేని నీళ్లు ఎక్కడికెళ్లి వచ్చినయ్? ఎట్లా వచ్చినయ్ అంటే దీని కి దమ్ము కావాలే. చేసే ఆరాటం ఉండాలే. ఇది నా ప్రాం తం, ఆరాటం ఉంటే ఎైట్లెనా సాధించుకోవచ్చు.
మనల్ని రక్షించేందుకు ఎవ్వడూ రాడు కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకంగా ఈ సభ పెట్టామని అనుకుంటున్నారు. ఉవ్వెత్తున మనం ఉద్యమంలా ఎగిసిపడకపోతే.. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే.. ఎవ్వడూ మన రక్షణకు రాడు. ఫ్లోరైడ్‌తో బాధపడిన నాడు ఎవ్వడూ రాలే. ఓట్లు ఉన్నప్పుడు నంగనాచి కబుర్లు చెప్తారు. ఆ తర్వాత ఎవ్వడూ రాడు. ఓటు గుద్దించుకొని గడ్డకెక్కినంక మన ఈపులపై గుద్ది బొందల నూకుతున్నరు తప్ప ఎవడూ రాలేదు. ఇది జరిగిన చరిత్ర.. జరుగుతున్న చరిత్ర. ఈ విషయాన్ని అందరూ గమనించాలి.ప్రభుత్వం భద్రప్పలెక్క వెళ్లి సంతకం పెట్టింది మీకు ఏం కోపం వచ్చిందో.. ఏ భ్రమలో పడ్డారో గానీ పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు. ఇది మూడో నెల నడుస్తున్నది. ఏం జరుగుతున్నదో మీరే కండ్లారా చూస్తున్నరు. చిన్నచిన్న విషయాలైతే పర్వాలేదు గానీ మన జీవితాలనే దెబ్బకొట్టే కృష్ణా జలాలను ఈ ప్రభుత్వం భద్రప్పలా వెళ్లి కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించింది. కొత్త ప్రభుత్వం రాగానే వెళ్లి భద్రప్పలెక్క సంతకం పెట్టారు. వాళ్లు సంతకాలు పె ట్టిన పత్రం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న హరీశ్‌రావు దీనివల్ల ఎంత నష్టం వస్తుందో గ్రహించి గర్జించిండు. ఆయన గర్జిస్తే నాలుగైదు రోజు లు నాటకాలు అడారు. అబద్ధాలు చెప్పారు. అసెంబ్లీ లో నిలబెట్టి గట్టిగా అడిగిండు. ఇదే జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రమే మంచిగుం డె ఇప్పుడు మంచిగలేదని మాట్లాడిండు. మరి అంత మంచిగుంటె ఇదే జిల్లాలో పుట్టిన శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయిండు? ఉద్యమకారులంతా ఎందు కు చచ్చిపోయారు? ఉద్యమం ఎందుకు జరిగింది? ల క్షల మంది, కోట్ల మంది ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నరు? ఇట్లా పూర్తిగా సోయి తప్పి మాట్లాడుతున్నరు.హక్కుల కోసం పిడికిలి బిగించాలె నేను మీ అందర్నీ కోరేది ఒక్కటే.అవసరమైనప్పుడు పోరాడాలి. అవసరమైతే సద్దులు గట్టుకొని రావాలె. మనం పిడికిలి బిగించాలె.
అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. అటు కేంద్రాన్ని గానీ, అధికారులను గానీ, కృష్ణా ట్రిబ్యునల్‌నిగానీ, రాష్ట్ర ప్రభుత్వంకూడా భద్రప్ప పని చేయకుండా అప్రమత్తంగ ఉంచెటట్టు నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పడానికే నేను ఇంతదూరమొచ్చిన. మిమ్ములందరినీ సమీకరించిన.కేసీఆర్‌ను తిడితే మీరు పెద్దోళ్లయితరా?ఇప్పుడు గవర్నమెంటు వచ్చింది. గవర్నమెంటు వచ్చినకాడి నుంచి మీరు చూస్తున్నరు. ఏదన్నా కొత్త గవర్నమెంటు వస్తె ఏం చేయాలె? పోయిన గవర్నమెం టు కంటె నాలుగు మంచి పనులు చేత్తం. ప్రజల నుం చి మంచి అనిపిచ్చుకుంటం అనే ఆరాటం ఉండాలె. ఒక్కటన్న మంచిమాట ఉన్నదా? పొద్దున లేస్తే సొల్లు పురాణం. కేసీఆర్‌ను తిట్టాలె. కేసీఆర్‌ని తిడితె మీరు పెద్దోళ్లయితరా? కేసీఆర్‌మీద లేనిపోని బద్నాంలు పెడితె మీరు పెద్దోళ్లయితరా? ప్రజల హక్కులు గాలికొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నరో.. ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నరో.. ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నరో టీవీల సాక్షిగా మీరం తా చూస్తున్నారు. నేను మీ అందర్నీ కోరేది ఒక్కటే. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం. మన వాటా శాశ్వతం. మన బతుకులు నిజం. మన పిల్లల భవిష్యత్తు నిజం. దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడి రాష్ర్టాన్ని తెచ్చినవాళ్లం కాబట్టి బీఆర్‌ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉం డాలె.. మన పోరాటం కొనసాగుతనే ఉండాలె.దద్దమ్మల రాజ్యముంటె ఇలాగే ఉంటది. మేము వచ్చినంక కరెంటు తెచ్చినం. బీఆర్‌ఎస్ గవర్నమెంటు వచ్చిన తరువాత కరెంటు తెచ్చినం. ఏడెనిమిది నెలల్లో కరెంటును బాగుజేసి యాడాదినర్ధం నుంచి రైతాంగానికి 24 గంటల కరెంటు ఇచ్చినం. మీరందరూ సంతోషంగా నడింట్ల పండుకొని పంటలు పండిచ్చిన్రు. పాములు కరవంగ, తేళ్లు కరవంగ, బాయిలకాడికి పోలే. కేసీఆర్ గవర్నమెంటు పోంగనే కటక ఏసినట్టే బంద్ అయితదా కరెంటు? మేము తొమ్మిదేండ్లు ఇచ్చిన కరెంటుకు ఏం రోగమైంది? దానికేమన్నా మాయరోగం వచ్చిందా? యాడికిబాయె కరెంటు? దద్దమ్మల రాజ్యముంటె గట్లనే ఉంటది. చేతగాని చవటల రాజ్యముంటె గట్లనే ఉంటది.
వాళ్లున్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలె ఏమైందిరా బిడ్డా నా కరెంటు అని అడగాలె. ఇయ్యాల నేనొక మాట ఖుల్లంఖుల్ల చెప్తున్న.. మొన్నటిదాక నడిసిన కరెంటు కాకుండా ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో 4000 మెగావాట్ల పవర్‌ప్లాంటు కట్టినం జగదీశ్వర్‌రెడ్డి నాయకత్వంలో. పనులు 90 శాతం అయిపోయినయి. రెండుమూడు నెలలు తిప్పలబడితే 4000 మెగావాట్ల కరెంటు వస్తది. రామగుండంలో ఆనాడు మొదలుపెట్టిన ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది. 800 మెగావాట్లు ఆల్రెడీ వచ్చేసింది.. ఇంకో 800 మెగావాట్లు రాబోతున్నది. నేను నడిపిన్నాడు అవసరం ఉన్నదానికంటే 5,600 మెగావాట్ల పవర్ ఎక్కువ ఉండంగ కూడా వీళ్లకి ఏమి రోగం పుట్టింది? కరెంటు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు తిప్పల పెడుతున్నరు?కేంద్రంతో కొట్లాడి ప్రాజెక్టులు చేపట్టినం ఆనాడు రాష్ట్రం కోసం కొట్లాడినం. జల సాధన ఉద్యమంలో ప్రతి మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెలన్నరపాటు ఊరూరా తిరిగి ప్రజల్ని చైతన్నవంతులను చేసినం. అప్పుడు 'పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమీ లేకపాయే' అనే పాటను నేనే రాసిన. తెలంగాణ వచ్చాక గోదావరి, కృష్ణా కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్టు పూర్తయింది. డిండి ప్రాజెక్టు పూర్తికాబోతున్నది. పాలమూరు ఎత్తిపోతల కోసం దేవరకొండ, మునుగోడు ఇతర ప్రాంతాల ప్రజలు నోర్లు తెరుచుకొని చూస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలు పూర్తయితే నీళ్లు వస్తాయని రంగారెడ్డి, వికారాబాద్ ప్రజలు కూడా ఎదరు చూస్తున్నారు. ఎవరు సహకరించకున్నాఇదే కాంగ్రెస్ నాయకులు వందల కేసులేసినా పదేండ్లు పంటి బిగువన కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకెళ్లి 80 శాతం పనులు పూర్తి చేసినం.
కాంగ్రెస్‌వాళ్లకు పదవులు కావాలె ఒక రైతుకు పంట పండిందట. వడ్ల రాశి అయింది. ఎనకట రాశి ఎవ్వడూ ఎత్తుకుపోకుండా పొత్తి పోసేది. బూడిదో.. సుద్దో ఏదో ఒకదానితో పోసేది. పక్క రైతుని పిలిచి పొరుగు రైతూ.. పొరుగు రైతూ పొత్తి పోయిరా బై అంటే.. ఉంటే నాకేంది, పోతే నాకేంది పులిగోలిగ అని పొత్తి పోసిండట. వీళ్లది ఏంబోతుంది! వాళ్లకు పదవులు కావాలి. పైరవీలు కావాలి.. డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు.. నేడు లేదు.చెప్పుతో కొట్టండి అంటరా.. ఎన్ని గుండెలురా మీకు? ఏం పనులు చెయ్యాలె వీళ్లు? మేము చేసినకాడికి మేము చేసినం.. మేము చేసిన ఫలితం కళ్లారా చూస్తున్నరు. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ. మూడుకోట్ల టన్నుల వడ్లు పండిచ్చింది ఇదే తెలంగాణ. ఏం బీమారి వచ్చింది నాకర్థంకాదు. రైతుబంధు ఇచ్చెటానికి కూడా చేతనైతలేదా? ఇంత దద్దమ్మలా? రైతుబంధు కూడా ఇయ్యరా? ఇత్తే ఇచ్చినవ్ ఇయ్యకపోతె ఇయ్యలే.. అన్నదాతలను పట్టుకోని, రైతులను పట్టుకోని రైతుబంధు రాలేదని అడిగేటోళ్లని చెప్పుతో కొట్టండి అంటవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్ల మాట్లాడుతరు? కండకావరమా? కండ్లు నెత్తికచ్చినయా? ప్రజలనేనా అనేదట్లా? ఒక్కమాట చెప్తున్న జాగ్రత్త.. నోటిదురుసు మాట్లాడేటోల్లారా.. చెప్పులు పంటలు పండిచ్చే రైతులకు కూడా ఉంటయ్. రైతుల చెప్పులెట్లుంటయ్? బందబస్తుగుంటయ్ బాగా.. గట్టిగుంటయ్. ఒక్కటే చెప్పుదెబ్బతోని మూడు పళ్లు ఊసిపోతయ్. దానికోసమేనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధతా? నీకు చేతగాకపోతే మాఫ్ చేయండి జర ఎనకసీరి ఇస్తా అని చెప్పాలె. ఎల్తలేదు అని చెప్పాలె. మాకు చేయొత్తలేదు అని చెప్పాలె. కానీ అడిగినోడ్ని చెప్పుతోని కొట్టాలె కేసీఆర్ చలో నల్లగొండ అంటే కేసీఆర్‌ను తిరగనియ్యం ఇంత మొగోళ్లా? కేసీఆర్‌ని తిరగనియ్యడట తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనియ్యరా? ఏంచేత్తరు? చంపేత్తరా దా యాపాటి చంపుతవో దా కేసీఆర్‌ని చంపి మీరు ఉంటరా? ఇది పద్ధతా? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యలమీద వస్తది. ప్రజల మధ్య అడుగుతది.. వాదన చెప్తది. నీకు దమ్ముంటే మేము చేసిందానికన్నా ఇంకా మంచిగచేసి చూపియ్యాలె. కరెంటు మంచిగిచ్చి చూపు. ఆగమాగం అడివడివి ఇష్టమొచ్చినట్టు చేస్తరా? ఏం చేయాల ఇయ్యాల? పాలమూరు ఎత్తిపోతల పూర్తిచేయాలె. దాని గురించి మాటలేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తిచేయాలె. దానిగురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలె పేదపిల్లలకు ఆ ముచ్చట లేదు.
కేసీఆర్‌పై కోపంతో రైతుల పొలాలు ఎండబెడతరా?ఈ ప్రభుత్వానికి ఇంకో మాట చెప్తున్నా. నల్లగొండ సభ నుంచే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. గోదావరి ప్రధాన ఉపనది ప్రాణహిత. ఇయ్యాల కూడా ఐదువేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నయి. అవి ఎత్తిపోయాలె. ఎల్‌ఎండీ, ఎంఎండీ నింపాలె. రైతులకు నీళ్లు ఇయ్యాలె. కానీ వాళ్లు ఏం చేస్తున్నారు? మేడిగడ్డ పోతాం. పోరుగడ్డకు పోతాం. బొందల గడ్డకు పొతాం అంటున్నరు. మేడిగడ్డ కాడ ఏం ఉన్నది. అసెంబ్లీ అయిన తర్వాత మీ బండారం బయట పెడుతాం. అసెంబ్లీ తర్వాత మేము కూడా అడికి పోతాం. మీ చరిత్ర ఎండగడుతాం. పోయిన ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని మేడిగడ్డకు పోతే.. ఏ చేస్తరు? ఎందుకు పోతున్నవు? దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయ్యి. నీళ్లు ఉన్నయ్. కాఫర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్లు ఎత్తి పోయొచ్చు. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దుష్ట బుద్ధి పెట్టుకుని రైతుల పొలాలను ఎండగొడతరా? ఇయ్యాల మహబూబాబాద్‌కు నీళ్లు ఇవ్వకుండా బంద్ పెట్టిండ్రు. డోర్నకల్‌కు, సూర్యాపేట, తుంగతుర్తికి మునుపొచ్చిన నీళ్లు వస్తలేవ్. తగ్గిపోతున్నాయ్. ఇదా మీ రాజకీయం?ట్రిబ్యునల్‌లో కొట్లాడాలె.. అదీ మొగోడు చేయాల్సిన పని ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నీటిపై ఒక ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తర్వాత ఎవరి వాటా వాళ్లకు వస్తదని చెప్పింది. అప్పుడున్న పరిస్థితులు వేరు. బిల్లు పాస్ కావాలె.. తెలంగాణ రావాలె.. దానికి ఇదొక ఆటంకం కావొద్దని భావించి సరే కానివ్వండి తర్వాత చూసుకుందాం అని చెప్పినం. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మోదీ ప్రభుత్వం వచ్చింది. వాళ్లకు నీళ్ల కోసం వందల ఉత్తరాలు రాసినం. 'అయ్యా మేం మునిగిందే నీళ్లలో. నాశనమైపోయినం మా బతుకులు ఆగమైపోయినయి.
వెంటనే నీళ్ల పంపిణీ చేయండి. ట్రిబ్యునల్ వేయండి' అని అడిగినం. కానీ వాళ్లు ట్రిబ్యునల్ వెయ్యలేదు. దీంతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ తగాదా పెట్టినం. అప్పుడు కూడా ట్రిబ్యునల్ వేయలేదు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో నేను గట్టిగ నిలదీస్తే.. 'మీరు కేసు ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్ వేస్తం' అని చెప్పారు. ట్రిబ్యునల్ వేసేది కేంద్రం కాబట్టి.. మంచి మాటేనని కేసు విత్‌డ్రా చేసుకున్నాం. అప్పటికి కూడా కేంద్రం ట్రిబ్యునల్ వేయలేదు. ట్రిబ్యునల్ వేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వందల ఉత్తరాలు రాసినం. కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలంతా ట్రిబ్యునల్ కోసం లోక్‌సభను స్తంభింపచేశారు. ఏదైనా సరే కోట్లాడండి అని నేను చెబితే వారం రోజులు మన ఎంపీలు లోక్‌సభను జరగనివ్వలేదు. అంతలా కోట్లాడినం. బీఆర్‌ఎస్ పోరాటం వల్ల ఆ ఒత్తిడికి తలొగ్గి ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కేంద్రం ట్రిబ్యునల్ వేసింది. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? మా ప్రభుత్వం ఉన్నా.. ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేయాలె? ట్రిబ్యునల్ ముందుకెళ్లి గట్టిగ వాదించి, చరిత్ర చెప్పి, మన అవసరాలు చెప్పి, కరువు గురించి చెప్పి, మన బాధలు చెప్పి.. మా నీళ్ల వాటా ఇంత రావాలె అని కొట్లాడాలె. ఇదీ మొగోడు చేయాల్సిన పని. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని.
చివరి శ్వాసవరకు పులిలాగా కొట్లాడుత తెలంగాణకు అన్యాయం జరిగితే నాకు చేతనైనా కాకపోయినా, నా కట్టె కాలేవరకు, చివరి శ్వాసవరకు పులిలాగ లేసి కొట్లాడుత తప్ప పిల్లిలాగ ఉండను. ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం జరుగుతున్నది. బడ్జెట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. చరిత్రలో ఎప్పుడూ బడ్జెట్‌ను పక్కనపెట్టి వేరే అంశాన్ని తీసుకోరు. కానీ బిడ్డా.. మిమ్మల్ని బజార్లో నిలబెడతా, ప్రజలముందే తేల్చుకుందాం అని నేను చలో నల్లగొండకు పిలుపునిచ్చిన. దీంతో కాంగ్రెసొళ్లు ఇక పీక్కపీక్క సచ్చుడు.. ఇజ్జత్, మానం పోతదిరా బై.. కేసీఆర్ పోయి అక్కడ బొబ్బపెడితే.. ఏం చేద్దాం అంటే ఏం చేద్దామని చేతులు పిసుక్కోని, కాళ్లు పిసుక్కోని అర్జంటుగా బడ్జెట్ పక్కకుపెట్టి శాసనసభలో తీర్మానం పెట్టిన్రు. ఆ తీర్మానం కూడా సక్కగలేదు. వాళ్ల తెలివి తెల్లార.. సాగునీళ్లు, తాగునీళ్లు అని పెట్టారే తప్ప.. కరెంటు ఉత్పత్తిని ఆ తీర్మానంలో పెట్టలేదు. అంత తెలివితక్కువ తీర్మానం. అది పెట్టి మమ అనిపిచ్చుకున్నరు.చలో నల్లగొండతోనే ఆపబోం
బిడ్డా.. ఇయ్యాల చలో నల్లగొండతోనే ఆపం. ఎక్కడ దొరికితె అక్కడ బజార్ల నిలదీసి మీ కథలు చేస్తం. ప్రజలను కరెంటుకు తిప్పలబెట్టినా.. నీళ్లకు తిప్పల పెట్టినా, మంచినీళ్లకు తిప్పలబెట్టినా ఎక్కడికక్కడ మిమ్ముల నిలబెడతం. మిమ్మల్ని గవర్నమెంటులోకి తెచ్చిన్రు.. మాకు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిన్రు. మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకిచ్చిన్రు. కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తం తప్ప వదిలిపెడ్తం అనే ఆశతో ఉండొద్దు. ఏ విధంగా బీఆర్‌ఎస్ గవర్నమెంటు ఇచ్చిందో అట్ల వెంటనే కరెంటును పునరుద్ధరించాలె. ఆ విధంగా మొత్తం రాష్ట్ర రైతాంగానికి కరెంటు ఇయ్యాలె. కానీ వీళ్ల వ్యవహారం ఎట్లున్నది? చరిత్రలనే ఎన్నడూ లేదు.. అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిన్రు వీళ్ల తెలివికి. మనోళ్లు ఒక మీటింగులో మాట్లాడుతుంటె ఏడుసార్లు కరెంటు పోతది. నల్లగొండలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుంటే ఏడుసార్లు పోతది కరెంటు. ఏమ్మాయరోగం వచ్చింది? మీకు తెలివిలేక, నడపరాక, చేతగాక ఇయ్యాల మందిమీద బద్నాం పెట్టి బతుకుదాం అనుకుంటున్నరా? అట్లకాదు బిడ్డ.. జాగ్రత్త బతకనియ్యం. ఎంబటపడతం.. వేటాడుతం.
చెప్పులు రైతుల కాళ్లకు కూడా ఉంటయ్ రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టండి అని అంటవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్ల మాట్లాడుతరు? కండకావరమా.. కండ్లు నెత్తికెక్కినయా? ప్రజలనా అనేదట్లా ఒక్కమాట చెప్తున్న. నోటిదురుసు మాట్లాడేటోళ్లారా జాగ్రత్త పంటలు పండిచ్చే రైతులకు కూడా చెప్పులు ఉంటయ్. రైతుల చెప్పులెట్లుంటయ్. బందవస్త్ ఉంటయ్. గట్టిగుంటయ్. ఒక్కటే చెప్పుదెబ్బతోని మూడు పళ్లు ఊసిపోతయ్. దానికోసమేనా మీరు అడిగేది?నల్లముఖం పిల్లి నల్లముఖం పిల్లిపోయి.. సచ్చిపోయిన ఎలుకను పట్టిందట.. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడుతోనే కృష్ణా నీళ్లను కేఆర్‌ఎంబీకి కట్టబెట్టింది అసెంబ్లీలోనే జనరేటర్ పెట్టినోళ్లు.యాడికి పోయింది మన కరెంటు? కట్కబంజేసినట్టు ఎందుకు ఆగింది? అసెంబ్లీలోనే జనరేటర్ పెట్టినోళ్లు మనకు కరెంటిస్తరా? రైతుబంధు ఏమైపోయింది? దద్దమ్మల రాజ్యముంటే, చేతకాని రాజ్యముంటే ఇట్లనే ఉంటది కేసీఆర్‌ను సంపి.. మీరుంటరా?'చలో నల్లగొండ' అంటే.. కేసీఆర్‌ను తిరగనియ్యం అంటున్నరు. అంత మొగోళ్లా? కేసీఆర్‌ని తిరగనియ్యరట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనియ్యరా? ఏంజేస్తరు? సంపేస్తరా? దా.. సంపుదువు దా ఏపాటి సంపుతవో రాష్ట్రం తెచ్చిన నాకు తండ్లాట ఉంటది.సభలో ఉన్నవాళ్లకు, టీవీలల్ల నా ఉపన్యాసం వింటున్నవాళ్లకు నేను దండం పెట్టి చెప్తున్న. నేను మీ బిడ్డను. పదిహేనేండ్లు పోరాడి, చావునోట్లో తలకాయపెట్టి, చివరకు చావుదలదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చిన. అందుకే నాకు గర్జుంటది, ఫికర్ ఉంటది. తండ్లాట ఉంటది. తెలంగాణ నాశనం కావద్దనే తపన ఉంటది. దీన్ని అర్థంచేసుకుని, ఎప్పుడు పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలె. ప్రభుత్వం దమన నీతిని ఎండగట్టి.. చాలా చేయాల్సి ఉంటది.