పార్లమెంటు ఎన్నికలకు "సై" అంటున్న ప్రధాన పార్టీలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో ఓటర్లను ఆకట్టుకునేందుకు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కో వ్యూహం అనుసరిస్తు న్నాయి. బీజేపీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమని చెబుతుంటే రాహుల్‌ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది.తాముంటేనే తెలంగాణకు నిజమైన అస్తిత్వముంటుం దని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలోని పార్టీలు తమ ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడుతున్న టీబీజేపీ రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు నెగ్గి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని చెబుతోంది. 2047 నాటికి దేశంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామంటోంది.
మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురు అవతరించే తరుణమిదేనని కమలనాథులంటున్నారు.తెలంగాణలో ప్రజాపాలన వచ్చినట్లే కేంద్రంలో రాహుల్‌ను ప్రధానిగా దేశవ్యాప్తంగా ప్రజాప్రభు త్వం రావాలని తెలంగాణ కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇండియా కూటమిని గెలిపించుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తోన్న రేవంత్ బీఆర్‌ఎస్ -బీజేపీలను తూర్పార పడుతున్నారు.తెలంగాణ సమస్యలను తాము మాత్రమే పార్ల మెంట్‌లో లేవనెత్తగలమని బీఆర్‌ఎస్ అంటోంది. జాతీయ పార్టీలకు తెలంగాణ సమస్యలు పట్టవని గులాబీనేతలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ గళం.. బలం తామేనంటూ గులాబీ పార్టీ రెడీ అవుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది.
మరిన్ని వార్తల కోసం...
* కేరళ ఆయుర్వేద బాలకల్పం గురించిన సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి
* పార్లమెంటు ఎన్నికలకు "సై" అంటున్న ప్రధాన పార్టీలు ఇక్కడ క్లిక్ చేయండి
* TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష : సీఎం రేవంత్ ఇక్కడ క్లిక్ చేయండి
* పద్మ శ్రీ గ్రహీతలకు ప్రతి నెల రూ.25 వేలు పించన్ : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు ఇక్కడ క్లిక్ చేయండి