రైతులకు శుభవార్త తెలియజేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఈఏడాది వర్షాకాలానికి సంబంధించి వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలియజేసింది. విషయంలోకి వెళ్తే ఈ ఏడాది దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.నైరుతి రుతుపవనాల కారణంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేయడం జరిగింది.జూన్ సెప్టెంబర్ మధ్య భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. పసిఫిక్ మహాసముద్రం లో కొనసాగుతున్న ఎల్ నినో బలహీనపడుతోందని జూన్ నాటికి పూర్తిగా క్షీణిస్తుందని తెలిపింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఈ ఏడాది వేసవి ఎండలు మండిపోతాయని పేర్కొనడం జరిగింది.దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఉదయమే మంచు కురుస్తూ ఉంది.గత ఏడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత కొద్దిగా తక్కువగానే ఉంది. ఈ ఫిబ్రవరి అనంతరం మార్చి నుండి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈసారి ఏప్రిల్ మే నెలలో భారీగా ఎండలు ఉష్ణోగ్రత నమోదవుతాయని పేర్కొంది. ఇక జూన్ నుండి సెప్టెంబర్ వరకు భారీగా వర్షాలు కురుస్తాయని రైతులకు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.