Type Here to Get Search Results !

Sports Ad

ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్ మోదీ స్పందనా Modi's response to interim budget before elections

                                                      

ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్ మోదీ స్పందనా

దిల్లీ Delhi News భారత్ ప్రతినిధి: కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న కేంద్ర ప్రభుత్వం గురువారం తాత్కాలిక బడ్జెట్‌(2024)ను ప్రవేశపెట్టింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్‌ విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు.సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్ ఇది. దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసం కలిగించింది. 

వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది కృషి చేస్తుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీ ఇచ్చింది. ఇది యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింబం. సాంకేతికత రంగంలో పరిశోధన సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటుచేశాం. 

అలాగే బడ్జెట్‌లో చెప్పిన మూలధన వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం గురించి ప్రకటించాం. మహిళలను లక్షాధికారుల్ని చేసే పథకాన్ని మూడుకోట్ల మందికి విస్తరించనున్నాం. ఆయుష్మాన్ భారత్‌ కింద ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి పొందనున్నారు. సామాన్య పౌరులపై భారం పడకుండా జీవనశైలిని మరింత సులభతరం చేయడం ఈ బడ్జెట్ ఉద్దేశం అని మోదీ అన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies