Type Here to Get Search Results !

Sports Ad

ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు New Chief Justices of six High Courts


  ఆరు హైకోర్టులకు  కొత్త ప్రధాన న్యాయమూర్తులు 

ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి: దేశంలోని ఆరు హైకోర్టులకు  కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాజస్థాన్‌ హైకోర్టుకు జస్టిస్‌ మనీంద్ర మోహన్‌ శ్రీవాస్తవ అలహాబాద్‌ హైకోర్టుకు జస్టిస్‌ అరుణ్‌ భన్సాలీ గువాహటి హైకోర్టుకు జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు జస్టిస్‌ రితుబహ్రీ ఒడిశా హైకోర్టుకు జస్టిస్‌ చక్రధారి శరణ్‌సింగ్‌ మేఘాలయ హైకోర్టుకు జస్టిస్‌ ఎస్‌.వైద్యనాథన్‌ నియమకానికి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము  ఆమోదముద్ర వేశారు  దీనికి సంబంధించి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    జస్టిస్‌ అరుణ్‌భన్సాలీ జస్టిస్‌విజయ్‌బిష్ణోయ్‌ జస్టిస్‌ఎంఎంశ్రీవాస్తవ జస్టిస్ఎస్‌వైద్యానాథన్‌ జస్టిస్‌చక్రధారిశరణ్‌సింగ్‌ జస్టిస్‌రబహ్రీలను చీఫ్‌జస్టిస్‌లుగా నియమించాలని గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టకొలీజియం సిఫార్సుచేసింది. రాజస్థాన్‌హైకోర్టుకు చీఫ్‌జస్టిస్‌గానియమితులైన జస్టిస్‌ ఎంఎంశ్రీవాస్తవ ప్రస్తుతం అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

   జస్టిస్‌ అరుణ్‌ భన్సాలీ జస్టిస్‌ విజయ్‌బిష్ణోయ్‌లు ప్రస్తుతం రాజస్థాన్‌ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారు. జస్టిస్‌ రితుబహ్రీ ప్రస్తుతం పంజాబ్‌ హరియాణాహైకోర్టులోతాత్కాలికప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్‌ చక్రధారి శరణ్‌ సింగ్‌ ప్రస్తుతం పట్నా హైకోర్టులో జస్టిస్‌ ఎస్‌ వైద్యనాథన్‌ ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టులో జడ్జిలుగా ఉన్నారు. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies