సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : సింగరేణిలో 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎండీ తెలిపారు. కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమాపై గురువారం యూబీఐతో ఒప్పందం జరగనుందని వెల్లడించారు. సింగరేణి డైరెక్టర్లతో సమావేశమైన బలరామ్ వివిధ అంశాలపై చర్చించారు. సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై డిప్యూటీ సీఎం సమీక్ష.సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సింగరేణిలో వెయ్యి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. వయోపరిమితి 40ఏళ్లకు పెంపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈనెల 26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో సింగరేణి అతిథిగృహం నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్టు వెల్లడించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.