Type Here to Get Search Results !

Sports Ad

నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు Problems caused by not drinking water properly

నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు 

 ఆరోగ్యం Health : ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగే వారి కన్నా బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే దాహం వేసినప్పుడు తాగుతా అంటారు కాని నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంత మంది నీళ్లు తాగుతున్నారు  ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు ఇది ఏ ఒక్కరి సమస్య కాదు నీళ్లు తాగాలంటే బద్దకంగా ఫీలయ్యేవారందరి సమస్య ఈ శరీరానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.

మీరు కుర్చుని లేవలేక పోతున్నారా కీళ్లు కండరాలు నొప్పులతో అవస్తపడుతున్నారా అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట ఎందుకంటే కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయి తలనొప్పి తరచుగా వస్తుందా  నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తుంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం బ్రెయిన్ కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి దీంతో తలనొప్పి వస్తుంది జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది అలసట ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా లేకపోవటం అనేవి తక్కువ నీరుకు సంబంధించినదే బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది.

దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే.. మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం యూరిన్ కలర్ మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి బ్రెయిన్ ఫంక్షన్ పైనా ఇది ప్రభావం చూపుతుంది మీ మూడ్ మెమరీ డెసిషన్ఏకాగ్రత వంటివాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది పెదాలు ఆరిపోవడం,చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవటం, పొడిబారిపోవటం అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం. ఇవే మీరు సరిగ్గా నీళ్లు తాగటం లేదని చెప్పే సంకేతాలు ఇకనైనా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies