సపోటా పండు..! తినటం వలన శరీరానికి కలిగే ప్రయెజనాలు
* శరీరానికి విటమి న్లు అందించే పండు
* అధిక బరువు, జీర్ణ సమస్యలకు పరిష్కారం
ఆరోగ్యం Health : ప్రకృతి నుంచి సహజ సిద్దంగా లభించే సపోటా మన ఆరోగ్యానికి సపోర్టుగా నిలుస్తుందనడంతో సందేహం లేదు. ఇందులో ఉండే విటమిన్లు శరీరానికి సమృద్దిగా అందుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బరువు తగ్గడం నుంచి మలబద్ధకం సమస్యల నివారణ వరకు సపోట దివౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున, ఇది సహజ జీర్ణ సమస్యల నివారిణిగా పనిచేస్తుంది. అందుకే మలబద్దకంతో బాధపడేవారు రోజూ ఒక సపోటా పండు తినాలి. కాబట్టి రోజూ అల్పాహారంతో ఒక పండు తినడం బెటర్. అప్పుడే అధిక ప్రయోజనం పొందుతారు. దీనిని తినడం వల్ల విటమిన్ ఎ, ఇ, సి, విటమిన్ బి కాంప్లెక్స్‌లు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.
అంతేకాకుండా జుట్టు, చర్మ సంరక్షణకు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడం నుంచి మలబద్ధకం సమస్యల నివారణ వరకు సపోట ధివౌషదంలా పనిచేస్తుంది. అంతే కాకుండా సపోటాలో ఉండే ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. అత్యంత అవసరమైన కాల్షియం కూడా ఇందులో సమృద్ధిగా ఉండడంతో ఎముకలను బలోపేతం చేయడంలో ఉపయోగపడే ఐరన్, భాస్వరం వంటి ఇతర ఖనిజాలు కూడా ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. సపోటా తినడం వల్ల ఇందులోని టానిన్ అనే సహజ పదార్ధం శరీరానికి అందుతుంది. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యలను సులువుగా తొలగిస్తుంది.ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మంత్రంలా పనిచేస్తుంది. ఈ పండులో కండరాలు, కణజాలాలను బలోపేతం చేయడానికి అవసరమైన మూలకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. హార్ట్ బర్న్, గ్యాస్ హార్ట్ బర్న్ వంటి సమస్యలు ఉన్నవారికి దాదాపు ప్రతిరోజూ సపోటా ఔషధంలా పనిచేస్తుంది.