Type Here to Get Search Results !

Sports Ad

మగవారి కోసం ప్రత్యేక బస్సులు? Separate buses for men?


 మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం ప్రారంభమైంది.మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తోన్న ఉచిత ప్రయాణం పథకం కింద తెలంగాణలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కిడికైనా ఫ్రీగా ప్రయాణించొచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జీరో టికెట్‌తో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.ఈపథకానికి రాష్ట్రవ్యా ప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజూ ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

       బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు. దాంతో చాలా మంది మగవారు తమ కోసం ప్రత్యేక బస్సులు నడపాలని.. లేదంటే అదనపు సర్వీసులైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు పలువురు.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ, మగవారికి సీట్లు లేకపోవడం వంటి ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ గోడు పట్టించుకోవాలని ఆర్టీసీ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుం దని,వార్తలు వస్తున్నాయి. బస్సుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ ఆలోచన చేస్తోన్నట్లు తెలుస్తుంది.పురుషులుకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఉచిత ప్రయాణం వల్ల విద్యార్థులు సైతం ఇబ్బంది పడుతు న్నారు. ఈ క్రమంలో వారి కోసం కొన్ని మార్గాల్లో మరీన్ని సర్వీసులు నడిపే విషయంపై ఉన్నతాధి కారులు చర్చిస్తున్నారట.అలాగే సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు స్పెషల్ బస్సులు నడపడంపై ఉన్నతాధి కారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తల కోసం... 
* పునర్నవ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ? ఇక్కడ క్లిక్ చేయండి
* మగవారి కోసం ప్రత్యేక బస్సులు? ఇక్కడ క్లిక్ చేయండి
* పాప ప్రాణాలు కాపాడిన ప్రజావాణి ఇక్కడ క్లిక్ చేయండి
* సర్పంచుల పదవి కలం పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies