కోటపల్లి మండల కేంద్రంలో ఘనంగా శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు
కోటపల్లి Kotapalli News భారత్ ప్రతినిధి : చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని కోటపల్లి మండల కేంద్రంలో శివాజీ యువజన సంఘం మరియు ఠాగూర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ మహారాజ్ నాడు మొగలాయిలు భారతదేశంపై దండయాత్ర చేసిన సమయంలో వారిని ఎదుర్కొని మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు . తన రాజ్యంలో స్త్రీలను గౌరవించుకుంటూ, కులాలకు మతాలకు అతీతంగా తన రాజ్యంలో అన్ని వర్గాలకు సమానత్వం కల్పించిన ఘనత శివాజీది అని అన్నారు. బహుజన బిడ్డ శివాజీ రాజ్యాధికారం చేపట్టే సమయంలో అష్ట కష్టాలు సవి చూడడం జరిగింది అని అన్నారు. శివాజీ ధైర్య సాహసాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజం పట్ల, దేశం పట్ల అవగాహన పెంచుకొని ప్రజలకు మరియు సమాజానికి సేవ చేయాలి అని అన్నారు. కార్యక్రమం అనంతరం ఇక్కడికి విచ్చేసిన అందరికీ పాయసం వడ్డించి అందరికీ తినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.