శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ఆరోగ్యసూచనలు
ఆరోగ్యం Health : ఒకే విషయాన్ని పదేపదే ఆలోచించడం, దీర్ఘాలోచన నుండి బయటపడకపోవడమే డిప్రెషన్. మనసుని,ఆలోచనల్ని మనల్ని వేధించే విషయాల నుంచి మరల్చడమే మందు.. ఇష్టమైన పని చేయడం ద్వారా డిప్రెషన్ ను నియంత్రించవచ్చు..డ్రాయింగ్, డ్యాన్స్, సింగింగ్,స్విమ్మింగ్ ఇలా ఏదోక వ్యాపకం పెట్టుకుంటే మనసు మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. మానసిక ఆరోగ్యానికి కావాల్సినవి వత్తిడి ని ఎదుర్కోడానికి సమగ్ర ప్రణాళిక కాస్త మంచి సంబంధ బాంధ్యవ్యాలు మన మేధస్సు కి తగిన సవాళ్లు జీవితం పట్ల కొంత కృతజ్ఞతా భావం ఒకవేళ ఏదైనా చిన్న పెద్ద సమస్య ఉంటే దాన్ని మగ్గబెట్టకుండా సైకాలజిస్ట్ లేదా కౌన్సిలింగ్ కోచింగ్ సపోర్ట్ తీసుకొనే విజ్ఞతపై చెప్పిన విషయాలు అన్నీ .
నిబద్ధత తో దీర్ఘకాలంలో ఆచరించడం అతి ముఖ్యమైనది ఈ విషయంలో పరిణతి అభివృద్ధి అమాంతంగా జరిగిపోదు కానీ క్రమ క్రమంగా సాధ్యమే చాలా మటుకు కష్టాలన్నీ మానసికమైనవే తీవ్రమైన సమస్యలనుకునే చాలా ఇబ్బందులకి కాలమే పరిష్కారాలిస్తుంది.అంతవరకూ ఆ ఆ సమస్యల గురించి , పరిస్థితుల గురించి మనం అతిగా ఆలోచించడం వల్లనే అవి కష్టాలలా తోస్తాయి నిజానికి - కనుక మనం మార్చలేని విషయాలపట్ల ఇతరుల ప్రవర్తనల పట్ల అంతగా ఆలోచించకుండా ఏదో ఓ పనిలోనో వ్యాపకాలు కల్పించుకోవడమో చేస్తే డిప్రెషన్ నుండి చాలా సులువుగా బయటపడవచ్చు.