గంజాయి దందాలో నిందితుడి అరెస్టు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి: సంగారెడ్డి గంజాయి కేసుల్లో రెండు సార్లు జైలుకెళ్లి వచ్చినా ఎలాంటి మార్పు రాలేదని మళ్లీ అదే బాటపట్టాడని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ పేర్కొన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వెల్లడించిన వివరాలు హత్నూర మండలం మల్కాపూర్‌కు బిహార్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ కొంతకాలం క్రితం వలసవచ్చాడు. అక్కడి ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు జనవరి 31న మల్కాపూర్‌లోని ప్రేమ్‌కుమార్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి కిలోన్నర ఎండు గంజాయి10 గంజాయి ప్యాకెట్లు 20 మత్తు చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గురువారం నిందతుడిని రిమాండ్‌కు తరలించారు మద్యం, ఇతర చెడు అలవాట్లకు బానిసగా మారి గంజాయి రవాణాకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు గంజాయి సాగు చేసినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో గంజాయి విక్రయాల కట్టడికి పరిశ్రమలు విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు కేసును చేధించిన పోలీసులను ఆయన అభినందించారు.