బషీరాబాద్ తహశీల్దార్ గా వెంకటేశం
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ తహశీల్దార్ గా మంగళవారం రోజు వై, వెంకటేశం పదవి బాధ్యతలు చేపట్టారు, ప్రస్తుతం బొంరాస్ పేట్ మండలంలో తాసిల్దారుగా పనిచేస్తున్న ఆయనను బషీరాబాద్ తాసిల్దారుగా బదిలీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ప్రకారం జారి చేయడం జరిగింది. ఇక్కడ తాసిల్దార్ గా ఉన్న వెంకట్ స్వామిని సంగారెడ్డికి బదిలీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో తాసిల్దార్ మాట్లాడుతూ బషీరాబాద్ మండలం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి భూ సమస్యలపై ధరణిపై ఎటువంటి సమస్యలు రాకుండా వెనువెంటనే పేద ప్రజల సమస్యలు తీరుస్తామని పేర్కొన్నారు.