Type Here to Get Search Results !

Sports Ad

పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి A young woman approached the court claiming that she was raped in the name of marriage


  పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి

* నిందితుడు వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడన్న కోర్టు
* శారీరక సంబంధానికి దానిని సాకుగా ఉపయోగించుకోలేదని స్పష్టీకరణ
* పిటిషన్‌ను కొట్టేసిన నాగ్‌పూర్ ధర్మాసనం

బాంబే Bombay News భారత్ ప్రతినిధి : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ క్రమంలో శారీకంగా ఒక్కటయ్యారు. అయితే, పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో అతడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రేమికురాలు కాస్తా కోర్టుకెక్కింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఆమె పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.అతడు పెళ్లి చేసుకోవాలనుకున్నా తల్లిదండ్రులు అంగీకరించకపోతే అతడేం చేస్తాడని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ కేసును కొట్టివేసింది. దీనిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. తాను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నానని, ఈ క్రమంలో ఇద్దరం ఒక్కటయ్యామని యువకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

      అయితే, తన తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చిందన్న అతడి వాదనతో జస్టిస్ ఎం.డబ్ల్యూ.చాంద్‌వానీ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం అంగీకరించింది. నిందితుడు వివాహం చేసుకుంటాడన్న వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడని, శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని దానిని సాకుగా వాడుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వాగ్దాన ఉల్లంఘన, హామీ నెరవేర్చకపోవడం మధ్య తేడా ఉందని గుర్తు చేశారు. నిజానికి అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడని, మొదటి నుంచీ అతడు అదే ఉద్దేశంతో ఉన్నాడని పేర్కొన్నారు. అయితే, పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేనంత మాత్రాన అతడు అత్యాచారం చేశాడని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం...
* చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు ఇక్కడ క్లిక్ చేయండి
* చలికాలంలో కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడుతున్నారా...ఇది మీకోసమే... ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రామాలకు ప్రత్యేక అధికారుల నియామకం ఇక్కడ క్లిక్ చేయండి
* ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కరెంటు కనెక్షన్‌కు సెల్ ఫోన్‌ నంబరు ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేయండి
* పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి ఇక్కడ క్లిక్ చేయండి
* రోడ్డెక్కిన ఆసరా పింఛన్‌ దారులు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies