15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మల్దకల్ Maldkal News భారత్ ప్రతినిధి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం మల్దకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడింది. అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సురేష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం రాత్రి 11 గంటలకు మల్దకల్ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో టిఎస్ 8 యుఎఫ్ 3984 నంబర్ గల బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు.అందులో 30 సంచులలో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ధరూర్ మండల కేంద్రానికి చెందిన ఎరుకలి వెంకటేశ్వర్లు, మల్దకల్ కు చెందిన ఎరుకలి రంగస్వామి ఇద్దరు కలిసి గ్రామాలలో తక్కువ రేటుకు రేషన్ బియ్యాన్ని సేకరించి ఎక్కువ రేటుకు విక్రయించేందుకు రాయచూరుకు తరలిస్తున్నారు. ఎరుకలి వెంకటేశ్వర్లు, ఎరుకలి రంగస్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.