చెక్‌పోస్టు దగ్గర పట్టుబడిన నగదు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ రాష్ట్ర సరిహద్దు నుండి కర్ణాటకకు నగదు తీసుకువెళ్ల్తుండగా చెక్ పోస్టులో విదులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ లోక్యనాయక్ మరియు కానిస్టేబుల్ రాందాస్‌లు వాహనాలు తనిఖీ చేస్తుండగా KA32EU3297 నెంబర్ గల ద్విచక్రవాహనంపై పటేల్ మనోజ్ కుమార్ షాదీపూర్ గ్రామం కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి యాబై వేల కన్నా ఎక్కువ నగదును తీసుకువెళ్తున్నందుకు గానూ బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ కి తెళియజేయగా ఇద్దరు పంచులు సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం డిస్ట్రిక్ట్ గ్రీవియెన్స్ కమిటీకి కలెక్టర్ కార్యాలయం, వికారాబాద్ జిల్లా పంపించడం జరుగుతుందని తెలిపారు.