Type Here to Get Search Results !

Sports Ad

ఈ బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా... RBI shocked these banks.. Withdrawal of only Rs. 15 thousand from the account...


 ఈ బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా... 

* 6 నెలల పాటు బ్యాంకులపై నిషేధం

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించిన బ్యాంకులపై చర్యలకు దిగుతోంది. రూల్స్‌ ఉల్లంఘించే బ్యాంకులను లైసెన్స్‌ రద్దు, భారీ జరిమానాలు, లావాదేవీలలో ఆంక్షలు తదితర చర్యలు చేపడుతుంది. పలు బ్యాంకులపై ఆంక్షలు మరింత కఠినతరం చేస్తోంది ఆర్బీఐ. అయితే ఆర్బీఐ బ్యాంకులపై తీసుకుంటున్న చర్యల కారణంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉందని చెబుతోంది.6 నెలల పాటు బ్యాంకులపై నిషేధం సెంట్రల్ బ్యాంక్ (RBI) ప్రత్యేకంగా అన్ని సేవింగ్స్ బ్యాంక్ లేదా కరెంట్ ఖాతాలు లేదా డిపాజిటర్ ఏదైనా ఇతర ఖాతా నుండి మొత్తం బ్యాలెన్స్ నుండి రూ. 15,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేమని తెలిపింది. 

     ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. దీని అర్థం బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిందని కాదు. సహకార బ్యాంకులపై ఆంక్షలు విధించిన తర్వాత, అర్హత కలిగిన డిపాజిటర్లు డిఐసిజిసి నుండి రూ. 5 లక్షల వరకు తమ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులు అని ఆర్‌బిఐ తెలిపింది. ఈ ఆంక్షలు ఏప్రిల్ 15, 2024 న వ్యాపారం ముగియడంతో 6 నెలల పాటు అమలులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు.బ్యాంక్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. ఆర్బీఐ ఆర్డర్ తర్వాత, ప్రస్తుతం ఖాతాదారులు బ్యాంకులోని ఏదైనా కరెంట్ ఖాతా లేదా సేవింగ్స్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉండదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies