Type Here to Get Search Results !

Sports Ad

ఆగస్టు 15 నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ : మంత్రి పొన్నం ప్రభాకర్ Two lakh loan waiver for farmers by August 15: Minister Ponnam Prabhakar


 ఆగస్టు 15 నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ Karimnagar News భారత్ ప్రతినిధి : కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్ర వారం ఆయన కరీంనగర్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌ లకు ఓటు వేసి వృథా చేసు కోవద్దని ఓటర్లకు పిలుపుని చ్చారు.రాష్ట్రానికి, కరీంనగర్‌కు ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధికి తాను సిద్ధమని బోయినపల్లి వినోద్ కుమార్ సిద్ధమా? అని సవాల్ చేశారు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నా యని శుభవార్త చెప్పారు.ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాదు  

    వచ్చే ఆగష్టు 15వ తేదీ లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.వచ్చే వానాకాలం పంటకు రూ.500 బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే రైతులు అని అన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అందిస్తోందని చెప్పారు.ప్రజల్లో ప్రభుత్వానికి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరి స్తున్నాయని మండిపడ్డారు. అక్కసుతో ప్రభుత్వంపై బోగస్ మాటలు మాట్లాడు తున్నారని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని తెలి పారు. వినోద్ కుమార్‌ను ఓడించడానికి గతంలో గంగుల లోపాయి కారి ఒప్పందం చేసుకున్నా రని తెలిపారు. పేద ప్రజల భూములను లాక్కున్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం... 
* ఆగస్టు 15 నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ : మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్‌ ఈ-కేవైసీకి మరో అవకాశం ఇక్కడ క్లిక్ చేయండి
* వారంలోనే ఇంటర్ పలితాలు ఇక్కడ క్లిక్ చేయండి
* 21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* కాలేయాన్ని కాపాడుకుందాం ఇక్కడ క్లిక్ చేయండి
* వడ దెబ్బ తగిలిన వెంటనే ఇలా చేయండి లేకపోతే ప్రాణాలు పోతాయ్! ఇక్కడ క్లిక్ చేయండి
* నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే! ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రము లొ 45 డిగ్రీలు దాటిన ఎండలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies