నీట్ పీజీ 2024 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
న్యూఢిల్లీ New Delhi News భారత్ ప్రతినిధి : న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఎన్‌బీఈఎంఎస్ 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పీజీ 2024 పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 23వ తేదీన నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ ఎంఎస్ పీజీ డిప్లొమా తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పీజీ 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ లో మే 6, 2024వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.