Type Here to Get Search Results !

Sports Ad

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్ Polling started in 21 states

 

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్ 

న్యూఢిల్లీ New Delhi News భారత్ ప్రతినిధి : ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవిత వ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్‌ కోసం లక్షా 87వేల పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 మంది మహిళలు, 11,371 ఇతరు లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1వ తేదీన ముగియ నుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రి య సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరిం చింది. లోక్ సభ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడులో 39 సీట్లు, ఉత్తరాఖండ్ లో 5 సీట్లు ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణి పూర్ లో 2 సీట్ల చొప్పున ఉన్నాయి.అండమాన్ అండ్ నికోబార్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్ లో ఒక్కో సీటు చొప్పున ఉన్నాయి.ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్ లోనే ఎన్నికలు ముగియనున్నాయి.

మరిన్ని వార్తల కోసం... 
* ఆగస్టు 15 నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ : మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్‌ ఈ-కేవైసీకి మరో అవకాశం ఇక్కడ క్లిక్ చేయండి
* వారంలోనే ఇంటర్ పలితాలు ఇక్కడ క్లిక్ చేయండి
* 21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* కాలేయాన్ని కాపాడుకుందాం ఇక్కడ క్లిక్ చేయండి
* వడ దెబ్బ తగిలిన వెంటనే ఇలా చేయండి లేకపోతే ప్రాణాలు పోతాయ్! ఇక్కడ క్లిక్ చేయండి
* నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే! ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రము లొ 45 డిగ్రీలు దాటిన ఎండలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies