Type Here to Get Search Results !

Sports Ad

24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు The High Court canceled the jobs of 24 thousand school teachers


 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్ West Bengal News భారత్ ప్రతినిధి : పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు ఈరోజు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్ మెంట్లను రద్దు చేసింది.ఆ టీచర్లంతా ఆరు వారాల్లో  గా వారు పొందిన జీతాలను 12 శాతం వడ్డీతో వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. క్యాన్సర్ తో బాధపడుతున్న సోమా దాస్ అనే వ్యక్తికి మాత్రం మినహాయింపు ఇచ్చి ఉద్యోగంలో కొనసా గేందుకు అనుమతి ఇచ్చింది.అలాగే కొత్త టీచర్ల నియామ కాల ప్రక్రియను 15 రోజుల్లో గా చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ దెబాంగ్సు బాసక్, మొహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.కోర్టు తీర్పుతో గ్రూప్ సీ, డీతోపాటు 9, 10, 11, 12 తరగతుల టీచర్లకు చెందిన సుమారు 24 వేల ఉద్యోగా లు రద్దయ్యాయి.

     పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న 24, 640 టీచర్ పోస్టుల భర్తీకి 2016లో రాష్ర్ట స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహిం చింది.అయితే అభ్యర్థుల ఎంపిక లో అక్రమాలు జరిగాయని.. అనర్హులు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. దీనిపై సుప్రీం కోర్టు ఆదేశంతో హైకోర్టు విచారణ ప్రారంభించింది.కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐ ని ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ ఈ స్కాంలో పాత్ర ఉందంటూ 2022లో నాటి విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీతోపాటు బెంగాల్ స్కూల్ సర్వీసు కమిషన్ లో పనిచేసిన కొందరు అధికారులను అరెస్టు చేసింది. పార్థా చటర్జీకి ప్రధాన అను చరురాలైన అర్పితా ముఖర్జీ కి చెందిన కోల్ కతా నివాసా న్ని సీబీఐ తనికీ చేయగా రూ. 21 కోట్ల నగదు, రూ. కోటికిపైగా విలువ చేసే నగలు లభించాయి. ఈ కేసులో సీబీఐ తమ దర్యా ప్తు కొనసాగించి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది.

మరిన్ని వార్తల కోసం... 
* జోగిపేటలో దారుణం... బాలుడిని చంపి ఉరివేసుకున్నా రౌడీషీటర్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం.. అక్కడి నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై నిషేధం.. ఇక్కడ క్లిక్ చేయండి
* 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ఇక్కడ క్లిక్ చేయండి
*  24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies