హైదరాబాద్ Hyderabad Newsభారత్ ప్రతినిధి : తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది.18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించు కున్నారని.. ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని తెలిపింది.మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు.