తాండూరు తాగునీటి ఎద్దడికి యాక్షన్ ప్లాన్..!
* కాగ్నా నీటి వినియోగానికి చర్యలు
* ఆదేశించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ
తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : వేసవిలో తాండూరు పరిసన ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం తాండూరు పరిధిలోని కాగ్నానది పరిసర ప్రాంతాలను సందర్శించారు. నదీ సవి పంలోని పంపుహౌస్, తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో వి షన్ భగీరథ నీటి సరఫరా స్థంభిస్తే ప్రజలకు అత్యవసరంగా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు.కాగ్నానది నుంచి సరఫరా చేస్తున్న తాగునీటి పైపులైన్ వ్యవస్థను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంపుహౌస్ బోర్ల పనితీరును. అడిగి తెలుసుకున్నారు. కాగ్నానదిలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ తాండూరు ఈఈ నాగేశ్వర్ రావు, డీఈ శశాంక్ మిశ్రా తదితరులు ఉన్నారు.