తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్ తెలంగాణ ఇంటర్, పదో తరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 25 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపుగా చివరికి వచ్చింది. ఏప్రిల్ చివరి వారంలో లేదంటే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.