అంబేడ్కర్ జయంతి... నివాళులర్పించిన సీఎం రేవంత్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావి తరాలకు స్పూర్తిగా నిలిచిన గొప్ప దార్శనికుడు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో అడుగులు వేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.