Type Here to Get Search Results !

Sports Ad

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం Another sensation in the case of phone tapping


 ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం

* పాలమూరులో ఇద్దరు పోలీస్ (బాస్) సిఐలు ?
* పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపణ వాస్తవ రూపం

పాలమూరు Palamuru News భారత్ ప్రతినిధి : పాలమూరులో ఫోన్ టాపింగ్ జరిగిందని ఇటీవలే  ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణ వాస్తవరూపం దాల్చిందని తెలుస్తుంది, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఫోన్ టాపింగ్ కేసులో సూత్రధారులైన రాజకీయ నాయకులతో పాటు పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి తో పాటు జిల్లాకు చెందిన పోలీస్ శాఖ  పాత్రధారులైన ఇద్దరు సిఐలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి, వీరితోపాటు నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి,, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరో ఎంపీ అభ్యర్థితో పాటు రాష్ట్ర పోలీస్ శాఖలో కీలకంగా వ్యవహరించిన రాయకి నాయకులు అధికారులపై త్వరలో విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది, ఈ కేసులులో అరెస్టు అయిన పోలీస్ విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసు జారీ చేసి విచారించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది, 

     ఈ వ్యవహారంలో మరో వ్యక్తి తప్పుడు పాస్ పోర్టుతో విదేశాల పరారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి, ఈ విషయంపై పాలమూరు ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు వేగవంతమైనట్లు అలాగే కేసుకు బలం చేకూరినట్లు తెలుస్తుంది, ఇప్పటికే జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నట్లు ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు, పాలమూరులో ఇద్దరు సిఐలు ఫోన్ ట్యాపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ వర్గాలు ఆందోళనచెందుతున్నాయి ,వ్యాపారస్తులతోపాటు, పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, సీటు విత్తనాల కంపెనీల యజమానులపై ట్యాపింగ్ పాల్పడినట్లు ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు, వీటిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఒక క్రమ పద్ధతిలో విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తుంది,

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies