ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాదులు, కవిత తరఫున న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని.. విచారణకు ఆమె సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవితను 9 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దీని ప్రకారం.. కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.