నీటి సరఫరాపై సమీక్షలో అధికారులపై CM రేవంత్ రెడ్డి సీరియస్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై సమీక్షలో అధికారులపై CM రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 'కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి బస్తీలకు తక్కువ నీరు ఇచ్చే సిబ్బందిపై నిఘా పెట్టాలి. ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే చర్యలు తప్పవు. ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలి. MSP కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దు' అని స్పష్టం చేశారు.